రైటర్ కమ్ హీరో ఇది రేర్ కాంబినేషన్ అయినా సరే వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో అడివి శేష్. క్షణంతో మొదలైన అతని హిట్ సినిమాల పరంపర ఆరు వరుస సక్సెస్ లతో కొనసాగిస్తున్నాడు. రీసెంట్ గా హిట్ 2 తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అడివి శేష్. నాని నిర్మాతగా శైలేష్ కొలను డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించింది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ మీద కన్నేశాడు అడివి శేష్. అది ఏ సినిమానో కాదు గూఢచారి 2. గూఢచారి సినిమాతో సూపర్ సెన్సేషనల్ హిట్ అందుకున్న అడివి శేష్ ఆ మూవీ సీక్వల్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. అసలైతే మేజర్ కన్నా కుందు గూఢచారి 2నే చేయాల్సి ఉన్నా మహేష్ నిర్మాతగా వ్యవహరించడంతో మేజర్ ని పూర్తి చేసి రిలీజ్ చేశారు.
హిట్ 2 తర్వాత ప్రస్తుతం గూఢచారి 2 మీద ఫోకస్ పెట్టాడు అడివి శేష్. ఈ మూవీ ని శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేస్తున్నారు. గూఢచారి తర్వాత మేజర్ సినిమాను కూడా శశికిరణ్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు గూఢచారి 2ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. adivi sesh planing for another blockbuster గూఢచారి 2 ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ మేజర్ తో నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్న అడివి శేష్ హిట్ 2 ని కూడా అక్కడకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు గూఢచారి 2ని కూడా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. సో ఎలా లేదన్నా అది కూడా అడివి శేష్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే సినిమా అవుతుందని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్ గా వచ్చిన గూఢచారి 2018లో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఈ మూవీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.