UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 IT రైడ్స్ మీద DEVINENI అవినాష్ ఊహించని వ్యాఖ్యలు..!

తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్, బీజేపీ పోరు అన్నట్టుగా నడిచిన విషయం తెలిసిందే. ఐటీ అధికారులు తెలంగాణలో వరుసగా దాడులు చేసిన విషయం తెలిసిందే.

ఆ దాడులు ఇప్పుడు ఏపీకి కూడా పాకాయి. వంశీరామ్ బిల్డర్స్ పై నిన్న ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. వంశీరామ్ బిల్డర్స్ పై నిన్న జరిగిన ఐటీ తనిఖీల్లో భాగంగా ఆ సంస్థతో సంబంధం ఉన్న, లావాదేవీలు జరిపిన వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడలో ఆయన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఆ సమయంలో అవినాష్ ను కూడా అధికారులు చాలా సేపు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.దేవినేని అవినాష్.. అధికార వైఎస్సార్సీపీ పార్టీకి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ చార్జ్ గా ఉన్నాడు. ఆయన ఇంట్లో నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం 6 వరకు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే.. ల్యాండ్ డెవలప్ మెంట్ ఒప్పందంపై వంశీరామ్ బిల్డర్స్ తో అవినాష్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దానిపైనే అధికారులు అవినాష్ ను కూడా ప్రశ్నించారు. ఐటీ అధికారులు వెళ్లిపోయిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు తెలిపారు.

ఐటీ శాఖ అధికారుల కోసం నేను పూర్తిగా సహకరించాను. మా జీవితాలు తెరిచిన తెల్ల పుస్తకాల్లాంటివి. ప్రజలే మాకు ఆస్తులు. మాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దేవినేని కుటుంబం గురించి అందరికీ తెలిసిందే కదా. మేము నిత్యం ప్రజల్లో ఉంటాం.. రాజకీయాలు చేయడం మాత్రమే మాకు తెలుసు. సాధారణమైన తనిఖీ మాత్రమే ఇది. ఈ సోదాల్లో ఎలాంటి అక్రమాలు బయటపడలేదు.. అంటూ దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !