UPDATES  

 ఇన్‌స్టంట్ సెట్ దోశ… మినపప్పు, బియ్యం లేకుండా..

మనం దోశలు వేసుకోవాలంటే మినపప్పు, బియ్యం ఉపయోగించి చేస్తాము.

అయితే వీటిని చేయడానికి కాస్త ఎక్కువ ప్రాసెస్ పడుతుంది. అయితే మీరు దోశ పిండి తయారు చేయనప్పుడు.. మీకు దోశలు తినాలనిపిస్తే.. ఇంట్లోనే చక్కగా ఇన్‌స్టంట్ సెట్ దోశలు తినవచ్చు. అదేలా అనుకుంటున్నారా? అయితే మీరు ఇన్‌స్టంట్ సెట్ దోశల రెసిపీ గురించి తెలుసుకోవాల్సిందే. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పోహా – 1 కప్పు

* రవ్వ – 1 కప్పు

* ఉప్పు – తగినంత

* ఫ్రూట్స్ సాల్ట్ – తగినంత

* ఆయిల్ – అవసరం మేరకు

* పెరుగు – పావు కప్పు

ఇన్‌స్టంట్ సెట్ దోశ తయారీ విధానం

ముందుగా రవ్వ, పోహా (నానబెట్టినది), పెరుగు, ఉప్పు వేసి.. మిక్సీలో వేసి పిండి చేయాలి. దానికి కొంచెం నీరు కలిపి.. మెత్తగా పిండి అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. అంతే దోశ పిండి రెడీ. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి… నూనె వేసి వేడిచేయండి. దానిపై కొద్దిగా పిండి వేసి..దోశలను వేసుకుని ఒకవైపు మాత్రమే కాల్చండి. అంతే వేడి వేడి సెట్ దోశ రెడీ. మీకు ఇష్టమైన చట్నీతో దీనిని హ్యాపీగా లాగించేయవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !