UPDATES  

 మీ చికెన్ స్కిన్ ఇలా వదిలించుకోండి..

కెరటోసిస్ పైరాలిస్‌ని.. చికెన్ స్కిన్ అని కూడా అంటారు. ఇది మొటిమలను పోలి ఉంటుంది. దీని కారణంగా చర్మంపై చిన్న చిన్న మొటిమలు కనిపిస్తాయి. ఈ చిన్న గడ్డలు లేదా మొటిమలు అని పిలువబడే డెడ్ స్కిన్ సెల్స్​లో ఫోలికల్స్ కనిపిస్తాయి. ఈ చిన్న మొటిమలు ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. కెరటోసిస్ పిలారిస్ ఎక్కువగా.. చేయి, తొడ, చెంప పైభాగంలో కనిపిస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో కెరటోసిస్ పిలారిస్ సమస్య తీవ్రమవుతుంది. ఎందుకంటే చల్లని వాతావరణం వల్ల మన శరీరం తేమను కోల్పోతుంది. దీని వల్ల పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుంది. మరి దీనిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో.. ఈ సమస్యను వదిలించుకోవాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ స్నానపు అలవాటు మార్చుకోండి.. మీకు చికెన్ స్కిన్ ఉంటే.. దానిని నయం చేసుకోవాలని అనుకుంటే మీరు కచ్చితంగా మీ స్నానపు అలవాటు కొద్దిగా మార్చుకోవాలి. అదేంటంటే.. ఎక్కువసేపు స్నానం చేయడం మానుకోండి. స్నానం చేసేటప్పుడు చాలా ఎక్కువగా వేడి ఉన్న నీటిని ఉపయోగించకండి. వేడినీటితో స్నానం చేస్తే.. మీ చర్మం పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి.. స్నానం చేసేప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. దీనివల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని.. మీ సమస్య తగ్గుతుంది.

హైడ్రేటెడ్​గా ఉండండి కెరటోసిస్ పైరాలిస్‌ చర్మాన్ని తగ్గించుకోవడానికి మీ శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచడం చాలా ముఖ్యం. దీనికోసం మీరు లాక్టిక్ ఆమ్లాన్ని ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది. చలికాలంలో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. కాబట్టి ఎక్కువగా నీరు తాగితే.. మీ చర్మం హైడ్రేట్​గా ఉంటుంది. ఎక్స్‌ఫోలియేట్ చేయండి చికెన్ స్కిన్ నివారించడానికి.. చర్మాన్ని క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయండి. దీని కోసం మీరు మృదువైన, రసాయన-సమృద్ధిగా ఉన్న ఉత్పత్తులను ఉపయోగించండి. ఇవి చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. క్రీమ్ ఉపయోగించండి కెరటోసిస్ పైలారిస్‌ను తగ్గించడానికి.. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ కలిగి ఉన్న క్రీములను చర్మానికి అప్లై చేయండి. ఇది మీ చర్మాన్ని వదులుగా, హైడ్రేటెడ్​గా చేస్తుంది. ఈ సమ్మేళనాలన్నీ కలిసి చర్మాన్ని వదులుగా చేసి మృతకణాలను బయటకు పంపుతాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !