UPDATES  

 రష్యాలో పుష్ప ప్రభంజనం

ఇండియన్‌ సినిమాలు విదేశాల్లో సక్సెస్‌ కావడం అప్పుడప్పుడూ మనం చూస్తూనే ఉంటాం. ఈ మధ్యే జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సృష్టించిన ప్రభంజనం కూడా చూశాం. ఇక ఇప్పుడు పుష్ప మూవీ రష్యాలో సత్తా చాటడానికి సిద్ధమైంది. ఈ సినిమా గురువారం (డిసెంబర్‌ 8) రష్యా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడి 24 నగరాల్లో ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం పుష్ప టీమ్‌ మొత్తం రష్యా వెళ్లిన విషయం తెలుసు కదా. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తోపాటు రష్మిక, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ రష్యాలో మూవీ ప్రమోషన్లు నిర్వహించారు. మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లలో వేసిన ప్రీమియర్‌ షోలను చూశారు. అక్కడి మీడియాతో మాట్లాడారు. సాధ్యమైనంత వరకూ హైప్‌ క్రియేట్‌ చేయడానికి ప్రయత్నించారు. మొత్తంగా రష్యాలో పుష్ప ప్రమోషన్ల కోసమే ఆ టీమ్‌ ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేసింది. ఇది నిజంగా చాలా ఎక్కువే. ఇండియన్‌ సినిమాలకు పెద్దగా మార్కెట్‌ ఉండని రష్యాలాంటి దేశంలో ఇంత పెద్ద మొత్తం కేవలం ప్రమోషన్లకే చేయడం విశేషమే.

ఇప్పుడీ మొత్తం తిరిగి వస్తుందా లేదా అన్నది చూడాలి. అది జరగాలంటే అక్కడి ఆడియెన్స్‌కు కూడా పుష్ప బాగా నచ్చాలి. నిజానికి రూ.2-3 కోట్లలో ప్రమోషన్లు పూర్తి చేయాలని మేకర్స్ భావించినా.. అది కాస్త రెట్టింపైంది. రష్యన్‌ భాషలో డబ్‌ చేసి ఆ దేశంలో చాలా థియేటర్లలోనే రిలీజ్‌ చేశారు. ఆ ఫలితం కూడా త్వరలోనే తెలిసిపోతుంది. ఒకవేళ ఊహించిన ఫలితం రాకపోతే మాత్రం ప్రమోషన్లకు పెట్టిన ఖర్చంతా వృథా అవుతుంది. మరోవైపు మేకర్స్‌ పుష్ప: ది రూల్‌ షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. పుష్ప తొలి పార్ట్‌ సూపర్‌ హిట్ కావడంతో సీక్వెల్‌ను మరింత భారీగా తీసుకురావడానికి సుకుమార్‌ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే బడ్జెట్‌ కూడా భారీగా పెంచేశారు. ఫహద్‌ ఫాజిల్‌, అనసూయలు ఈ సీక్వెల్‌లోనూ కనిపించనున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో మూవీ రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !