UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ కృషి – ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే తెరాస పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు

గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ కృషి

– ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే తెరాస పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు

గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు అని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, తెరాస పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోపాల్ రావు పేటలో గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం కోసం ఐదు లక్షలు. పినపాక మండలం హెడ్ క్వార్టర్ కోసం పది లక్షల రూపాయలు సిసి రోడ్లులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు. అని ఆయన అన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పకడ్బందీగా అమలు అవుతున్నాయి అని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేయడం జరుగుతుంది అని అన్నారు. ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని అన్నారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలుగా చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను మంజూరు చేయడంతో పాటు డంపింగ్ యార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. గ్రామస్తులకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన జలాలను సరఫరా చేస్తున్నదన్నారు అని తెలిపారు. ప్రతీ గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలు, అంతిమ సంస్కారాల కోసం వైకుంఠ ధామాలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. గ్రామాలవారీగా ముడేండ్ల అభివృద్ధి ప్రణాళిక ను ప్రభుత్వం సిద్ధం చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం 70ఏండ్లలో సాధించాల్సిన అభివృద్ధిని కేవలం ఏడేండ్లలో సాధించిందని కితాబిచ్చారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో పండువలా కొనసాగుతోందన్నారు. జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ సర్కార్ సాకారం చేస్తున్నదని అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి సరిపడ నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ విడుదల చేస్తున్నదని అన్నారు. కరోనా లాంటి సంక్షోభంలోనూ ప్రభుత్వం రైతులు పండించే పంటలకు పెట్టుబడిసాయంగా రైతు బంధు విడుదల చేసిందన్నారు. రైతు మృతిచెందితే అతడి కుటుంబం రోడ్డునపడే దుస్థితి నెలకొనవద్దనే ఉద్దేశంతో రైతు బీమా పథకం ద్వారా నామినీకి రూ.5లక్షల చెక్కును ప్రభుత్వం అందజేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక మార్పుల కారణంగా రైతులు సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల బలవన్మరణాల దాఖలాల్లేవని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !