UPDATES  

 జాతీయ పార్టీలుగా తమకుతాము చెప్పుకునే పార్టీలకు గుణపాఠాలు నేర్పే స్థాయికి అమ్అద్మీ పార్టీ

జాతీయ పార్టీలు ఏవీ? ఎలా ఉద్భవించాయి? అన్నది నేటి జనరేషన్ లో చాలామందికి తెలియదు.. యావత్ భారతావనని పాలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా అందరూ గుర్తిస్తున్నారు కానీ.. బీజేపీ, వామపక్షాలు జాతీయ పార్టీలుగా ఎలా అవతరించాయి..ఆ పార్టీలు ఎన్ని సమస్యలు అధిమించాయి? ఎలా జాతీయ పార్టీలుగా అవతరించాయి? అన్నది ఇప్పటి జనరేషన్ లో చాలామందికి తెలియని విషయాలు. అసలు జాతీయ పార్టీగా అవతరించడానికి కావాల్సిన అర్హతలేమిటి? ఎలా జాతీయ అర్హత సాధించాయి అన్నది ఇప్పటికీ తెలియని విషయమే. కానీ పదేళ్ల కింద లోక్ పాల్ ఉద్యమం నుంచి ఆవిర్భవించిన అమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఉద్భవించిన తీరు మాత్రం అందరికీ సుపరిచితం. పదేళ్ల చరిత్రలోనే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా విస్తరించింది. సుదీర్ఘ కాలం రాజకీయ యవనికపై ఉండి జాతీయ పార్టీలుగా తమకుతాము చెప్పుకునే పార్టీలకు గుణపాఠాలు నేర్పే స్థాయికి అమ్అద్మీ పార్టీ చేరుకుంది,. arvind kejriwal- kcr రాష్ట్రంలో ప్రాంతీయ ఆకంక్షాలుగా చాలా ప్రాంతీయ పార్టీలు పురుడుబోసుకున్నాయి. దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాయి. అటు తరువాత జాతీయ పార్టీలుగా అవతరించాయి. కానీ వీటిలో కొన్నే సక్సెస్ సాధించాయి. కానీ తమకు తాము జాతీయ పార్టీలుగా ప్రకటించుకొని చతికిల పడిన పార్టీలు ఉన్నాయి. కనీసం రాష్ట్రం దాటి పోటీచేయని చాలా పార్టీలు తమకు తాము జాతీయ పార్టీలుగా అభివర్ణించుకుంటున్నాయి.

కానీ ఏమంత ప్రభావం చూపలేకపోతున్నాయి. ఢిల్లీ, హర్యాన, రాజస్థాన్,పంజాబ్, గుజరాత్;హిమచల్ ప్రదేశ్, గోవాలో అనతికాలంలో విస్తరించిన అమ్ ఆద్మీ పార్టీ అసలు సిసలు జాతీయ పార్టీగా అవతరించింది. ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ జాతీయ పార్టీగా విస్తరించే క్రమంలో ఉన్న చాలా ప్రాంతీయ పార్టీలకు గుణపాఠం నేర్పింది ఆ పార్టీ. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీలుగా మారడం ఏలా చేపి చూపించింది. దశాబ్ద కాలం కిందట అవినీతికి వ్యతిరేకంగా అన్నాహాజరే లోక్ పాల్ ఉద్యమం నుంచి పురుడుబోసుకున్న పార్టీయే అమ్ ఆద్మీ. ఎందరో విద్యావంతులు, వివిధ రంగాల నిపుణులు చేరారు అమ్ ఆద్మీ పార్టీలో. అందులో ఒకరైన మాజీ ఐఆర్ఎస్ అధికారి అరవింద కేజ్రీవాల్ అమ్ ఆద్మీ రాజకీయ పార్టీని ప్రారంభించారు. జనంలోకి వెళ్లి తన బలమైన రాజకీయ కాంక్షను బయటపెట్టారు. సంప్రదాయ పార్టీలకు దీటుగా అమ్ ఆద్మీ పార్టీ లక్ష్యాలను ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు.అప్పటికే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఎదురుచూస్తున్న ఢిల్లీ ప్రజలు అమ్ అద్మీని అక్కున చేర్చుకున్నారు.తమ ఆకాంక్షలు కలిగిన పార్టీగా అంతులేని విజయాన్ని అందించారు. ఢిల్లీలో మొదలు పెట్టిన ఆ పార్టీ రాజకీయం… ఇప్పడు ఉత్తరాన విశేష ప్రభావం చూపుతోంది. ఢిల్లీలోనే ఆ పార్టీ జైత్రయాత్ర ఆగలేదు. వరుసగా అన్ని రాష్ట్రాలను చుట్టేస్తోంది. ఢిల్లీతో ప్రారంభమైన ప్రాబల్యం తరువాత హర్యాన, అటు తరువాత పంజాబ్ పై చూపింది. రాజకీయ శూన్యత కలిగిన పంజాబ్ పై పెను ప్రభావమే చూపింది. అధికారం హస్తగతమైంది. అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ కు తోసిరాజని ఆప్ రాజకీయంగా బలీయమైన శక్తిగా ఎదుగుతోంది. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఆప్ నిలుస్తోంది. Aam Aadmi Party- TDP And TRS అయితే ఆప్ తెలుగునాట ఉన్న టీడీపీ, టీఆర్ఎస్ లకు గట్టి గుణపాఠమే నేర్పింది. జాతీయ పార్టీలుగా విస్తరించాలన్న ఆ రెండుపార్టీలకు మార్గం సుగమం చేసింది. రాష్ట్ర విభజనతో టీడీపీ దారుణంగా దెబ్బతింది. కానీ వాటి నుంచి గుణపాఠాలు నేర్పకుండాటీడీపీ తనకు తానుగా జాతీయ పార్టీగాఅభివర్ణించుకుంది. 2104 ఎన్నికల్లో ప్రత్యేకపరిస్థితుల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తెలంగాణలో మాత్రం దెబ్బతిన్నారు. అందుకే టీడీపీని జాతీయ పార్టీగా తీర్చిదిద్ది తెలంగాణలో విస్తరించాలని చూశారు. కానీ కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసింది. చంద్రబాబుకు ఆదిలోనే చెక్ చెప్పే ప్రయత్నిస్తోంది. అటు తెలంగాణలో తనకు బీటలు వాలుతుండడంతో కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించారు., కానీ ఇంకా పురిటినొప్పులతోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లోఅరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అమ్ ఆద్మీ విజయాలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఆ రెండు పార్టీలపై పడింది. సంప్రదాయ పార్టీలు మాదిరిగాకాకుండా కేంద్రంలోని బీజేపీకి, కాంగ్రెస్ కు వ్యతిరేక శక్తిగా మార్చడంలో కేజ్రీవాల్ సఫలీకృతులయ్యారు. దాని ఫలితమే ఆప్ చెప్పుకోదగ్గ విజయాలు. దాని నుంచి స్ఫూర్తిని అందుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్, టీడీపీలపై ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !