UPDATES  

 సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు

తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా మారింది) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటారు. ప్రజల నుంచి వచ్చే వినతుల్ని సోషల్ మీడియా వేదికగానూ స్వీకరిస్తారు, చేతనైనంత సాయం వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ, ప్రభుత్వ పరంగానూ అవసరమైనవారికి చేస్తుంటారు. అంతే కాదు, సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు కూడా కేటీయార్‌ కి అలవాటే. అప్పుడప్పుడూ సరదా సంభాషణలూ సాగిస్తుంటారు సోషల్ మీడియా వేదికగా. క్రొయేషియా ఆటగాళ్ళకీ, హైద్రాబాద్‌కీ లింకేంటి..? ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల సందర్భంగా ఓ ట్వీటేశారు

కేటీయార్. ‘క్రొయేషియా ఆటగాళ్ళకే నా సపోర్ట్.. ఎందుకంటే, క్రొయేషియన్ జట్టులో కొందరు ఆటగాళ్ళకు సంబంధం వుంది. ఆ విషయం ఆ ఆటగాళ్ళకీ తెలియదు.. కానీ, ఆ విషయం మనం తేలిగ్గా కనిపెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరులు ఇనిచ్, ఇదరిచ్, ఉదరిచ్, ఐసాయిచ్, వైసాయిచ్ అని వున్నాయి..’ అంటూ పేర్కొన్నారు కేటీయార్. హైద్రాబాదీ ఉర్దూని కొందరు ఇలానే ఖూనీ చేస్తుంటారు. ఆ విషయాన్నే సెటైరికల్‌గా కేటీయార్ ట్వీటేశారన్నమాట. అయితే, నిజానికి ఇది కేటీయార్ వేసిన సొంత ట్వీట్ కాదు. వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్ అట. ఆ విషయాన్ని కేటీయార్ స్వయంగా పేర్కొంటూ, క్రెడిట్ ఒరిజినల్ క్రియేటర్‌కి ఇచ్చేశారు. దటీజ్ కేటీయార్.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !