UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 మరింత హెల్తీచికెన్​ రెసిపీ

చాలామంది చికెన్ ఇష్టంగా తింటారు. అయితే మరికొందరు దానిని ప్రొటీన్ కోసం మాత్రమే తింటారు. అయితే చికెన్ పోషకాలు పెంచుతూ.. టేస్ట్ కూడా అందించే రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరగాలు ఆరోగ్యానికి మంచివని.. మన అందరికీ తెలుసు. ముఖ్యంగా పాలకూర అనే ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాకుండా దీని టేస్ట్ చికెన్​తో మరింత రెట్టింపు అవుతుంది. ఈ టేస్టీ, హెల్తీ కర్రి ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * చికెన్ – 500 గ్రాములు * పసుపు – 1 టీస్పూన్ * కారం – 1 టీస్పూన్ * గరం మసాలా – 1 టీస్పూన్ * ధనియా పొడి – 1 టీస్పూన్ * అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 4 టేబుల్ స్పూన్ * పాలకూర – 4 టేబుల్ స్పూన్స్ * పచ్చిమిర్చి – 5 * మెంతి కూర – 1 టేబుల్ స్పూన్ * టొమాటోలు – 2 * పెద్ద ఉల్లిపాయ – 1 * జీలకర్ర – 1/2 టీస్పూన్ *- దాల్చిన చెక్క – 1 అంగుళం * క్రీమ్ – 1 టేబుల్ స్పూన్ * గరం మసాలా – 1/2 టీస్పూన్ గరం * పెరుగు – పావు కప్పు

తయారీ విధానం ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో చికెన్‌ వేసి.. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టేయండి. కొత్తిమీర, మెంతి ఆకులు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పులను వేసి.. దాని బ్లెండ్ చేయాలి. పాలకూరను దీనిలో వేయకూడదు. ముందు పాన్ వేడి.. నూనె వేయండి. దానిలో పాలకూరను వేయాలి. దానిపై మూత పెట్టి 5 నిముషాలు ఉడకనివ్వండి. అది పేస్ట్ మాదిరిగా ఉడుకుతుంది. దానిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే పాన్​లో నూనె వేసి.. జీలకర్ర వేయండి. దానిలో ఉల్లిపాయ వేసి వేయించండి. అవి బ్రౌన్ రంగులోకి మారేవరకు వేయించండి. దానిలో టొమాటోలు వేసి.. మెత్తగా ఉడికే వరకు వేయించండి. దానిలో మెరినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఉడకనివ్వండి. చికెన్ ఉడుకుతుంది అనిపించినప్పుడు.. దానిలో పాలకూర, కొత్తిమీర ఆకుల పేస్ట్ వేయండి. బాగా కలిపి మూత వేసి 5 నిముషాలు ఉంచండి. అనంతరం గరం మసాలా పౌడర్ వేసి.. మూతపెట్టకుండా 2 నిముషాలు ఉడికించండి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిలో 1 టేబుల్ స్పూన్ తాజా హెవీ క్రీమ్ కలపండి. దీనిని మీరు చపాతీ, అన్నంతో కలిపి హ్యాపీగా లాగించేయవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !