UPDATES  

 మాజీ మంత్రి కొండా ,కాంగ్రెస్ నేత సురేఖ రాజీనామా

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాదు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామనీ, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడం ఆందోళన కలిగించిందనీ, వరంగల్‌కి సంబంధించి ఒక్క లీడర్ పేరు కూడా లేకపోవడం బాధగా వుందనీ కొండా సురేఖ వాపోయారు.

తన కంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ప్రాధాన్యత కల్పించడమంటే తనను అవమానపరచడమేనని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకీ గుడ్ బై చెబుతారా.? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన లేదనీ, కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగుతాననీ కొండా సురేఖ అంటున్నారు. అయితే, ఆమె వైఎస్ షర్మిల నేతృత్వంలో ఏర్పాటైన వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

వైఎస్ షర్మిల అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరూ గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె షర్మిల వైపు వెళతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ మాత్రం పార్టీ మారేది లేదంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !