ఇంట్లో మొక్కలు ఉంటే ఆ ఇంటికే అందం వస్తుంది. అంతేనా చల్లని గాలి, పూల సువాసనలు ఆస్వాదించవచ్చు. ఇంటి చుట్టూ ఉండే ఆకుపచ్చదనం మీ మనసుకు ప్రశాంతతతో పాటు మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. మొక్కలు ఉండే ఇంట్లో ఎల్లప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో పెంచుకునే మొక్కల గురించి మాట్లాడాల్సి వస్తే, చాలా మంది గులాబీ మొక్కలను నాటేందుకు ఇష్టపడతారు. వివిధ రంగుల గులాబీ మొక్కలు మనసుకు నచ్చే పరిమళాలలను వెదజల్లడంతో పాటు, కనులకు ఇంపుగా కనిపిస్తాయి. అయితే నర్సరీ నుంచి ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న గులాబీ మొక్కలను ఇంట్లో నాటిన తర్వాత సరిగ్గా నాటుకోకపోవచ్చు.
ఎన్ని నీళ్లు పోసి, ఎంత పోషణ అందించినా గులాబీ మొక్క ఎండిపోతే అది చాలా నిరాశను కలిగిస్తుంది. కానీ, గులాబీ మొక్కల పెంపకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. Rose Gardening Tips- గులబీ మొక్కలు పెంచేందుకు చిట్కాలు గులబీ మొక్కలు పెంచేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం, వీటిని పాటించి చూడండి. కుండతో పాటు గులాబీ మొక్కను తీసుకోండి చాలా మంది కేవలం గులాబీ మొక్కను కొంటారు, దీని వల్ల ఇంట్లో గులాబీ మొక్కను నాటినప్పుడు గులాబీ సరిగ్గా పెరగదు. కాబట్టి కుండతో పాటు గులాబీ మొక్కను కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ నీరు పెట్టవద్దు మీరు వింటర్ సీజన్‌లో గులాబీలను నాటితే, మీరు ఒక రోజు వదిలి గులాబీ మొక్కలో నీరు అందించాలి. మరోవైపు వేసవిలో ప్రతిపూట ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది.
మట్టిని జాగ్రత్తగా చూసుకోండి మీరు మట్టిని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు, కానీ మీరు గులాబీ మొక్కను నాటినట్లయితే, నేల తడిగా, తేమగా ఉండాలి. అప్పుడు గులాబీ సులువుగా వికసించడం ప్రారంభమవుతుంది. పై నుండి పొడి మట్టి పోస్తే, అందులో ఇసుక వచ్చే ప్రమాదం ఉంది. ఇసుక మట్టిలో గులాబీ పెరగదు. సూర్యరశ్మిని అందించండి శీతాకాలంలో గులాబీలకు సూర్యరశ్మి చాలా అవసరం. ఉదయం వేళ ఒక గంట పాటు గులాబీకి గోరువెచ్చని సూర్యకాంతి తగిలేలా ఉంచండి. ఇది గులాబీని వికసించేలా చేస్తుంది, కానీ వేసవిలో వేడి ఎండలో గులాబీని ఉంచవద్దు. గులాబీ మొక్కలు పెంచేందుకు ఎక్కువ శ్రమ అసవసరం లేదు, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇక్కడ పేర్కొన్న సింపుల్ టిప్స్ పాటిస్తే గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.