UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 కాంతార vs రాజమౌళి. .. ఇంటర్నెట్ మొత్తం ఇదే డిస్కషన్ !

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో భారీగా వినిపిస్తున్న పేరు కాంతారా. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు నెల రోజులు కావస్తున్న ఇంకా తెలుగు రాష్ట్రాలలో కాంతారా టాక్ తగ్గలేదు.

ఇప్పటికి కూడా కొన్నిచోట్ల కాంతారా సినిమా గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే టాలీవుడ్ , బాలీవుడ్, కొలీ వుడ్ అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కాంతరా సినిమాను డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి ని పొగిడేస్తున్నారు. అయితే ఈ సినిమా దాదాపుగా 350 కోట్లను వసూలు చేసిందని వార్తలు వస్తున్నాయి.

అయితే కాంతర సినిమాని కేవలం 15 కోట్ల బడ్జెట్ తోనే నిర్మించినట్లు సమాచారం. కేవలం 15 కోట్ల బడ్జెట్లో తీసిన ఈ సినిమా 350 కోట్ల రాబడిని తెచ్చిందంటే సినిమాలో ఎంత దమ్ము ఉందో అర్థం అవుతుంది. దీనికి తోడు కన్నడ మరియు తెలుగు అభిమానులు సైతం ఈ సినిమాలను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి కాంతార సినిమాపై స్పందించారు. ఇక రాజమౌళి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. కాంతారా సినిమాలో రిషాబ్ శెట్టి దేవుడి గెటప్ లో కనిపించి.. అలాగే ఆయన చేసే శబ్దం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుందని చాలా మంది చెప్పారు. సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అంటూ పలువురు కామెంట్ చేశారు.

Rajamouli about kantara rishab shetty
ఇదే క్రమంలో రాజమౌళి సైతం ఆ మాటను గట్టిగా వినిపించారు. ఓ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ సినిమా కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా సరే భారీ వసూలను సాధిస్తుందని కాంతార నిరూపించింది. భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాలు హిట్టు కొట్టడం నార్మల్ గానే జరుగుతుంది కానీ చిన్నచిత్రంగా వచ్చిన సినిమా కాంతారా బాక్సాఫీస్ షేక్ చేసిందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్రమంలో మాట్లాడుతూ కొందరు జనాలు ఎప్పుడు చూసినా కాంతారా అంటూ భజన చేస్తున్నారని సినిమా బాగా తీశారు, చూశారు ,మెచ్చుకున్నారు అయిపోయింది. పదేపదే మెచ్చుకోవాల్సిన అవసరం ఏముందంటూ మన తెలుగు సినిమాలు కూడా బాగానే ఉన్నాయి కదా అంటూ అసహనం వ్యక్తం చేశారట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !