తమ పార్టీ వారు హత్యలు, అత్యాచారాలు చేసినా కాపాడుకునేందుకు తమ పార్టీలో పెద్దలు ఉన్నారని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏపీలోని వైకాపా ప్రభుత్వం నిర్ణీత గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయలేక పోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు.
పైగా, తమ పార్టీ వాళ్లు ఏం చేసినా కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అనంతబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ఆర్ఆర్ఆర్ స్పందిస్తూ, అనంతబాబు తమ పార్టీవాడు కాబట్టే కాపాడుకున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చార్జిషీట్ దాఖలు చేయలేకపోవడంతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తుచేశారు.
తమ పార్టీలో వాళ్లు హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా కాపాడటానికి తమ ప్రభుత్వ పెద్దలు ఉంటారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, చివరుక కార్పొరేషన్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారని రఘురామ కృష్ణంరాజు అన్నారు