ఇప్పుడు స్టార్ హీరోలు కేవలం వెండితెర మీదే కాకుండా బుల్లితెరపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి, నాని దగ్గుబాటి రానా, అక్కినేని నాగార్జున వివిధ రకాల షోలతో మెప్పించారు. ఇప్పుడు బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ షో పేరుకు తగ్గట్టుగానే శరవేగంగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ షో రావడానికి ప్రధాన కారణం అల్లు అరవింద్ ఆలోచన విధానం అని చెప్పాలి. ప్రత్యేకంగా బాలయ్యను ఒప్పించడం వలన ఈ షో రేంజ్ పెరిగింది.
అయితే ఇప్పుడు ఆహా స్థాయిని కూడా మంచి లెవెల్ కు పెంచాలని అనుకుంటున్నారు. తమిళంలో కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ కు మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే అక్కడి వారిని కూడా ఆకట్టుకునే విధంగా స్టార్ హీరోలతో మరిన్ని టాక్ షోలను చేయాలని అనుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ తో ఓటిటీ టాక్ షో చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. పాన్ ఇండియా హీరోగా మారిన బన్నీ పాన్ ఇండియా తరహాలో టాక్ షోని చేయాలని అనుకుంటున్నారు. ఆహా క్రియేటివ్ డిపార్ట్మెంట్ అల్లు అరవింద్ తో కొన్నిసార్లు చర్చించినట్లు తెలుస్తుంది.
అయితే దానికి అల్లు అరవింద్ ఒప్పుకోలేదని సమాచారం. Allu Arjun is rising as PAN INDIA STAR ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది కాబట్టి దానికి పోటీగా అలాంటి రిస్క్ లు చేయకూడదని డిసైడ్ అయ్యారట. ముందుగా అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ పూర్తయ్యాక ఆ విషయం గురించి ఆలోచిద్దామని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. ఒకవేళ అల్లు అరవింద్ ఓకే అంటే అల్లు అర్జున్ పుష్ప కంటే ముందు టాక్ షో తో వచ్చే అవకాశం ఉంది. బన్నీ ఇలా చేస్తే పుష్ప 2 సినిమాకి కూడా హెల్ప్ అవుతుంది. ఇక టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని పాన్ ఇండియా క్రేజ్ అల్లు అర్జున్ కి దక్కుతుంది.