: మెగాస్టార్ చిరంజీవి దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. లేటెస్ట్ గా వారిద్దరు కలిసి వాల్తేరు వీరయ్య సినిమాకు పనిచేశారు.
బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా నుంచి చిరు ఓ డ్యూయెట్ సాంగ్ లీక్ చేశారు. సౌత్ ఫ్రాన్స్ లో జరుపుకుంటున్న ఈ సాంగ్ షూటింగ్ గురించి చెప్పి సాంగ్ కొద్దిగా లీక్ చేశాడు చిరు.
నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి అవుతా సాంగ్ ఇది. అయితే ఈ సాంగ్ విన్న మెగా ఫ్యాన్స్ దేవి దెబ్బేశాడని అంటున్నారు. ఎప్పుడో విన్న ట్యూన్ లానే ఉంది ఈ సాంగ్. కొత్తగా అసలు ఏమి అనిపించలేదని అంటున్నారు. అంతేకాదు ఈ సాంగ్ కి సాహిత్యం కూడా దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చారని టాక్. దేవి సంగీతమే కాదు అప్పుడప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే పాటలు రాస్తాడు. అలానే వాల్తేరు వీరయ్యలో రెండు సాంగ్స్ రాశాడట. అయితే నువ్వు శ్రీదేవి అయితే సాంగ్ మాత్రం మెగా ఫ్యాన్స్ కి అంతగా నచ్చలేదు.
ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో కానీ చిరు లీక్ చేసినంత వరకైతే మాత్రం మెప్పించలేదు. చిరు మాత్రం ఈ పాట అందరిని అలరిస్తుందని అన్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం వాల్తేరు వీరయ్య సినిమాకు దేవి మ్యూజిక్ మైనస్ అవుతుందని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. మరి సినిమా రిలీజ్ ముందే ఈ నెగటివ్ ఫీడ్ బ్యాక్ సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుందని చెప్పొచ్చు. ఓ పక్క పోటీగా వస్తున్న వీర సిం హా రెడ్డికి థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తుంటే దేవి మాత్రం వీరయ్యకు రొటీన్ మ్యూజిక్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.