ఇప్పుడు ఎవరైనా సరే హెల్దీ ఫుడ్స్‌కి ప్రాధాన్యతనిస్తున్నారు. ఖర్చు ఎక్కువైనా సరే.. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలని భావిస్తున్నారు. నేడు జీవనశైలి చాలా మారిపోవడం, వరుసగా పుట్టుకొస్తున్న కొత్తకొత్త ఇన్ఫెక్షన్లు, ఎప్పుడూ ఉండే అనారోగ్య సమస్యలను తట్టుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఎక్కువగా ఇష్టపడే డెజర్ట్‌లు, స్నాక్స్‌లలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం ఎక్కువగా చూస్తున్నారు. చలికాలంలో సాయంత్రం వేళ స్నాక్స్ అంటే మనకు చాలా రకాల చిరుతిళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా వరకు అవి డీప్ ఫ్రైడ్ చేసినవే ఉంటాయి. బంగాళాదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా మంది ఇష్టంగా తింటారు.
కానీ ఇవి ఆరోగ్యకరమైనవి కావు. మరి వీటికి బదులుగా మీరెప్పుడైనా క్యారెట్ ఫ్రైస్ తిన్నారా? క్యారెట్స్ చాలా ఆరోగ్యకరమైనవి, వీటితో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. అయితే ఇవి ఆయిల్ ఫ్రై చేయడం కాకుండా బేక్ చేస్తాం కాబట్టి ఆరోగ్యకరమైనవి. కరకరలాడుతూ కారంగా కమ్మగా ఉంటాయి. మరి క్యారెట్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో ఇక్కడ రెసిపీ ఉంది, మీరూ ట్రై చేయండి. Carrot Fries Recipe కోసం కావలసినవి 5-6 మీడియం సైజు క్యారెట్లు 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె 2 టీస్పూన్లు మొక్కజొన్న 1 టీస్పూన్ కారం 1/2 టీస్పూన్ ధనియాల పొడి 1/2 టీస్పూన్ ఉప్పు 1/4 టీస్పూన్ మిరియాలపోడి తరిగిన కొత్తిమీర సర్వ్ చేయడానికి సాస్ లేదా డిప్ క్యారెట్ ఫ్రైస్ తయారీ విధానం ముందుగా ఓవెన్‌ను 425°F వరకు వేడి చేయండి. మరోవైపు క్యారెట్‌లను సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో క్యారెట్ ముక్కలు వేసి, అందులో నూనె, మొక్కజొన్న పిండి, కారం, ధనియాలపొడి, ఉప్పు మరియు, పెప్పర్ వేసి అన్నీ బాగా కలపండి. అనంతరం బేకింగ్ ట్రేని అల్యూమినియం ఫాయిల్‌తో వరుసలో ఉంచి నూనెతో గ్రీజు చేయండి. ఆపై క్యారెట్‌లను ట్రేపై వరుసలో ఉంచండి క్యారెట్ల ట్రేను ఓవెన్‌లో ఉంచి 100 డిగ్రీల వద్ద 20 నిమిషాలు బేక్ చేయండి. ఇప్పుడు బయటకు తీసి పైనుంచి కొత్తిమీర చల్లుకోండి. అంతే, క్యారెట్ ఫ్రైస్ రెడీ. చాయ్ తాగుతూ వీటిని ఆస్వాదించండి.