UPDATES  

 ఏపీలో సలహదారులు, కీలక నామినేటెడ్ పోస్టుల్లో రెడ్డి సామాజికవర్గందే అగ్రస్థానం

ఏపీలో సలహదారులు, కీలక నామినేటెడ్ పోస్టుల్లో రెడ్డి సామాజికవర్గందే అగ్రస్థానం. వారి నియామకం నుంచి జీతభత్యాల కేటాయింపు వరకూ అంత గోప్యంగా జరుగుతోంది. వారికి ఇట్టే కొనసాగింపు లభిస్తుంది. ఒక వేళ కాస్తా ఆలస్యమైనా.. ఏరియర్స్ తో సహా చెల్లింపులు వస్తాయంటూ పునర్నియామక ఉత్తర్వుల్లోనే తెలియజేస్తారు. అధినేత సామాజికవర్గం కాబట్టి రెడ్డి సామాజికవర్గం వారికి రాజభోగాలు, అనుకూల జీవోలు వస్తుంటాయి.కానీ బీసీల విషయానికి వస్తే మాత్రం అంతలా ఇంట్రస్ట్ చూపరు. జయహో బీసీ అన్న నినాదంతో గర్జించి వారం రోజులైనా గడవ లేదు. రాష్ట్రంలో ఉన్న బీసీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దయ్యాయి. తమకు తిరుగులేదు,.,కొనసాగింపు లభిస్తుందని ఆశపెట్టకున్న నేతలకు ప్రభుత్వం షాకిచ్చింది. పాత వారినే కొనసాగిస్తున్నట్టు.. లేకుంటే వారి స్థానంలో మరో బీసీ నేతలను భర్తీ చేస్తున్నామన్న ప్రకటనేదీ వెలువడలేదు.

దీంతో రెండేళ్ల కిందట నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్యవర్గసభ్యులు అంతా మాజీలయ్యారు. YCP BC Leaders రెండేళ్ల కిందట ..అంటే 2020 డిసెంబరు 17న ‘బీసీల సంక్రాంతి’ పేరిట 56 బీసీ కార్పొరేషన్లకు జగన్ సర్కారు చైర్మన్లను నియమించింది. వారితో పాటు సరాసరి మరో 300 మందికి పదవులు కట్టబెట్టింది. వారి ప్రమాణ స్వీకారం చేసిన నాడు విజయవాడలో పెద్ద పరేడే నిర్వహించింది. దీంతో తమకు విధులు, నిధులు ఖాయమని కార్పొరేషన్ చైర్మన్లు తెగ సంబరపడిపోయారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. అయితేవేతనాలు, ఇతర అలవెన్స్ లు, వాహన సదుపాయం సమకూరడంతో కులానికి కాకపోయినా.. పదవి తమకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చిందని లోలోపల మదనపడుతూనే సంతృప్తి పడ్డారు. ఈ రెండేళ్ల కాలంలో పైసా విదిల్చలేదు. పథకాలనే కార్పొరేషన్లకు విభిజించి మీకు ఇంత లబ్ధి చేకూర్చాం చూడండి అంటూ జగన్ వారిలో సంతృప్తి నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా పదవులు కోల్పోయేసరికి నేతలకు తత్వం బోధపడింది. కులంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించలేకపోయాం.. చివరకు తాము కూడా రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయామన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !