జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ అవతార్ -2 తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఈ సీక్వెల్‌పై భారీ స్థాయిలో అంచనాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అరు వందలకుపైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. శుక్రవారం రోజు ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రాలో కలిపి పధ్నాలుగు కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. నైజాంలో 5.5 కోట్ల గ్రాస్ రాబట్టగా సీడెడ్‌లో రెండు కోట్లు, ఆంధ్రాలో అరు కోట్ల యాభై లక్షల గ్రాస్‌ను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు స్టేట్స్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హాలీవుడ్ సినిమాగా అవతార్ -2 రికార్డ్ క్రియేట్ చేసింది.
గతంలో ఈ రికార్డ్ అవెంజర్స్ ది ఎండ్ గేమ్ పేరు మీద ఉన్నది. ఈ రికార్డ్‌ను అవతార్ -2 అధిగమించింది. 2009లో రూపొందిన అవతార్ సినిమాకు సీక్వెల్‌గా అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాను తెరకెక్కించారు జేమ్స్ కామెరూన్. క్వారిచ్ బృందం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జాక్, నెట్రి చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సీక్వెల్ తెరకెక్కింది. ఈ సినిమాలో రీఫ్ ఐలాండ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఎగిరే జంతువులు, సముద్ర గర్భంలోని అందాలతో సాగిన గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నాయి. యాక్షన్ అంశాల కంటే ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ -2. రొటీన్ కథ తో పాటు సినిమా లెంగ్త్ విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి.