UPDATES  

 పవన్ ను కెలికి చుక్కలు చూస్తున్న అంబటి

ఏపీలో నోరున్న నేతల్లో మంత్రి అంబటి రాంబాబు ఒకరు. అయినదానికి కానిదానికి ఆయన రంకెలు వేస్తుంటారు. జనసేన అధ్యక్షుడు పవన్ విషయంలో ఆయన చేసే యాగి అంతాఇంతాకాదు. పవన్ అంటేనే మండిపడతారు. పవన్ ఏం పనిచేసినా ఆయనకు నచ్చదు. చివరకు పవన్ చదివే పుస్తకం, ధరించే దుస్తులు, ఆయన ప్రచారానికి తయారు చేసుకున్న రథం .ఇలా దేన్ని అంబటి రాంబాబు విడిచిపెట్టలేదు. ఇక వ్యక్తిగత జీవితంపైనా కామెంట్స్ ను వీడలేదు. పవన్ ను ఎన్ని విధాలా విమర్శలు చేయాలో అన్నిరకాలుగా చేశారు. అందుకే ఆయనపై ఎన్ని వివాదాలు నడిచినా పవన్ ను తూలనాడుతున్నాడన్న ఒకేఒక కాన్సెప్ట్ తో జగన్ మంత్రి వర్గంలో స్థానమిచ్చారు. కీలక పోర్టు పోలియోను సైతం కేటాయించారు. ఇక అంబటి ఆగుతాడా వీరవిహారం చేస్తున్నాడు.

అయితే ఈయన చర్యలను గమనిస్తున్న పవన్ రాజకీయంగా చెక్ చెప్పి.. వచ్చే ఎన్నికల్లో ఓటమితో ఇంటికి పంపిస్తే కానీ తిక్క కుదరదన్న నిశ్చయానికి వచ్చారు. అందుకే అంబటిని టార్గెట్ చేసుకున్నారు. కౌలురైతు భరోసా యాత్రను ఏరికోరి అంబటి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో ఏర్పాటుచేయించారు. పవన్ ను అడ్డుకోవడానికి మాచర్లలో విధ్వంసాన్ని సాకుగా చూపినా వర్కవుట్ కాలేదు. పవన్ వచ్చి.. నేరుగా రైతులకు సాయమిచ్చి మరీ సవాల్ చేయగలిగారు. వైసీపీ పై పదునైన కత్తులు విసిరినట్టు పంజా విసరగలిగారు. Pawan Kalyan- Ambati Rambabu అంబటికి పవన్ కొత్త నిర్వచనమిచ్చారు. ఆయన కాపుల గుండెల్లో కుంపటిగా అభివర్ణించారు. పోలవరం పూర్తిచేయలేని ఆయన మంత్రా అంటూ ప్రశ్నించారు. ఆయనవి ఉత్తరకుమార ప్రగల్భాలు అంటూ చెప్పుకొచ్చారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని పరోక్షంగా అంబటిపై ఆరోపణలు చేశారు. అయితే అంబటిని ఏపీ సమాజంలో మరింత పలుచన చేసే ప్రయత్నంలో భాగంగానే పవన్ తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. వాస్తవానికి అంబటితో పాటు ఉమ్మడి గుంటూరులో మరో మంత్రి జోగి రమేష్ పై కూడా పవన్ గురిపెట్టారు. వీరిద్దర్నీ వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వకూడదని డిసైడ్ అయ్యారు. అందుకే వారి అవినీతిపై విమర్శలు సందిస్తున్నారు. ఎన్నికల్లో వారిపై ప్రత్యేక వ్యూహంతో పనిచేయాలని భావిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !