UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 పుష్ప 2 లో రష్మిక మందన్న ఔట్ .. సాయి పల్లవి ఇప్పుడు హీరోయిన్ ..?

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. పుష్ప మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప 2 సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. కథలో కొన్ని రకాల యూనిక్ అంశాలు యాడ్ చేశారు. దీంతో రెండవ భాగంలో అదనపు కొత్త పాత్రలు యాడ్ అవుతున్నాయి. పుష్ప లో ఉన్న పాత్రలు పుష్ప 2 లో కనిపించనున్నాయి. కనిపించే ప్రతి పాత్రకి అంతే ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో మరో హీరోయిన్ సాయి పల్లవి ని తీసుకుంటున్నట్లు సినిమా స్టేట్స్ మీదకి వెళ్ళకముందే వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ రెండవ హీరోయిన్ పాత్రను డిమాండ్ చేయడంతో సుకుమార్ సాయి పల్లవి తీసుకుంటున్నట్లు న్యూస్ బయటకు వచ్చింది. అయితే సాయి పల్లవి నటిస్తుందా లేదా అనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త పాత్ర తెరపైకి వస్తుంది.

ఇందులో ఓ గిరిజన యువతి పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే ఆ పాత్రకి ఐశ్వర్య రాజేష్ అయితే సెట్ అవుతుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. ఇలాంటి పాత్ర అయితే ఐశ్వర్య రాజేష్ కు బాగా సెట్ అవుతుంది.చక్కని ఆహార్యం తో అన్ని పక్కగా సూట్ అవుతాయి. sai pallavi act main role in Pushpa 2 Movie కానీ ఇక్కడే మరొక డౌట్ వస్తుంది. ఇలాంటి కొత్త పాత్ర ఎంట్రీ నేపథ్యంలో ఒక డౌట్ వినిపిస్తుంది. సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నది సెకండ్ హీరోయిన్ గా లేక మెయిన్ హీరోయిన్ గానా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవికి క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తుంది. అది చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని పట్టించుకోదు. నటనకు ఆస్కారం ఉన్న ఎటువంటి పాత్రలోనైనా నటిస్తుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించక తప్పదు. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !