సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అలీ ఈటీవీలో రెగ్యులర్ గా ఏదో ఒక కార్యక్రమం తో సందడి చేస్తూనే ఉన్నాడు. దాదాపు పది సంవత్సరాలుగా అలీ కార్యక్రమాలు ఈటీవీలో ప్రసారమవుతున్నాయి. అలీ గేమ్ షో ఆలీతో జాలీగా చాలా సంవత్సరాలు కొనసాగింది. సెలబ్రిటీలతో ఆటలాడిస్తూ సందడి చేసిన అలీ ఆ తర్వాత ఆలీతో సరదాగా అనే టాక్ షోని మొదలు పెట్టాడు. ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలను స్టార్స్ ని ప్రేక్షకుల ముందు ఉంచాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాల్లో అతి కొన్ని కార్యక్రమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కుతుంది. ఆ కార్యక్రమాల్లో ప్రేక్షకుల ఆదరణ దక్కుతున్న కార్యక్రమాల్లో అలీ టాక్ షో కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలీ తో సరదాగా సుదీర్ఘ కాలమైన కొనసాగింపు కలిగి ఉన్నది. ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ అలీ గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించాడు. సుమ చివరి ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చింది
. అయితే ఈసారి రివర్స్ గా అలీని సుమ ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భం గా అలీ మాట్లాడుతూ కచ్చితంగా మరేదైనా రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తాను అన్నట్లుగా హామీ ఇచ్చాడు. ఆలీ మళ్ళీ టాక్ షో తో కాకుండా గేమ్ షో తో వచ్చే అవకాశాలు ఉన్నాయి Alitho Saradaga talk show ends now అంటూ ఈటీవీ వర్గాల వారి నుండి సమాచారం అందుతుంది. అలీతో సరదాగా కాకుండా ఆలీతో జాలీగా ను మళ్లీ మొదలు పెట్టే అవకాశాలు లేక పోలేదు అంటూ ఆయన అభిమానులు మరియు ఈటీవీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. అలీ తో సరదాగా ముగియడం పట్ల ఆయన అభిమానులు మరియు ఈటీవీ ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వాటిలో అలీ టాక్ షో చాలా ప్రత్యేకమైనదంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి టాక్ లేకపోవడం విచారకరం.