UPDATES  

 భారత్‌లో అవతార్-2 చిత్రం రూ.200 కోట్ల మార్కు

వహించిన అవతార్ 2 సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబరు 16న విడుదలైన సంగతి తెలిసిందే.

కథలో పెద్దగా బలం లేకపోయినప్పటికీ.. వీఎఫ్‌ఎక్స్ విజువల్ అనుభూతికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. దీంతో కలెక్షన్లు మెరుగ్గానే వస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇందులోని గ్రాఫిక్స్ మంత్ర ముగ్ధులవుతున్నారు. ఫలితంగా అవతార్‌కు ఈ విషయంలో మౌత్ టాక్ పాజిటివ్‌గానే ఉంటోంది. తొలి వీకెండ్‌లో బాగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం సోమవారం నుంచి కలెక్షన్లు కొద్దిగా దిగజారాయి.

తెలుగు రాష్ట్రాల్లో అవతార్-2 తొలి రోజున రూ.14.2 కోట్లను రాబట్టింది. మొదటి వీకెండ్‌కు దాదాపు రూ.45 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ప్రస్తుతం రూ.50 కోట్ల మార్కును దాటి రూ.60 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల మైలురాయిని అధిగమించేలా ఉంది. కథా పరంగా మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ మూడు రోజుల్లోనే ఈ మేరకు వసూళ్ల రావడం సానుకూల పరిణామమనే చెప్పాలి.

ఇంక భారత్‌లో అవతార్-2 చిత్రం రూ.200 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. అజయ్ దేవగణ్ నటించిన దృశ్యం-2 లైఫ్ టైమ్ కలెక్షన్లు రూ.228 కోట్ల మార్కును సులభంగా అధిగమించేలా ఉంది. సెకెండ్ వీకెండ్‌కే ఈ రికార్డును దాటేలా కనిపిస్తోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.3500 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. ఎవేంజర్స్ ఎండ్ గేమ్‌తో పోలిస్తే కాస్త తగ్గినా.. మెరుగైన కలెక్షన్లతోనే వెళ్తోంది.

జేమ్స్ కేమరూన్ 2009లో తెరకెక్కించిన అవతార్ సినిమాకు సీక్వెల్‌గా అవతార్ 2 తెరకెక్కింది. డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రధానంగా ఫ్యామిలీ ఎమోషన్ స్టోరీగా సాగింది. సినిమాలో ప్రధాన పాత్రయిన జేక్ సల్లీ.. మానవాళీ నుంచి రక్షణ పొందడానికి తన భార్య, పిల్లలతో కలిసి సముద్రం పక్కన నివసించే వేరే జాతితో కలిసి జీవిస్తాడు. కుటుంబ రక్షణే ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. సామ్ వర్తింగ్‌టన్, సిగోర్నీ వీవర్, జోయ్ సల్దానా, కేట్ విన్‌స్లెట్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !