UPDATES  

 యాక్సిడెంట్‌ లో రెండు ముక్కలు అయిన ఫెరారీ కారు

ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కార్లలో ఫెరారీ కార్లు కూడా ఉంటాయని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాంటి ఫెరారీ కారు ఒక యాసిడెంట్ లో ఏకంగా రెండు ముక్కలవ్వడం ప్రపంచ వ్యాప్తంగా కార్ల వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయితే తప్పితే అలా కారు రెండు ముక్కలవ్వడం జరగదు. అది కూడా ఫెరారీ కారు రెండు ముక్కలు అవ్వడానికి అది ఒక భారీ యాక్సిడెంట్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి భారీ యాక్సిడెంట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 70 ఏళ్ల రాబర్ట్ ఎరుపు రంగు ఫెరారీ కారుని నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఆయన రెండు కార్లను ఢీ కొట్టాడు. కార్లను ఢీ కొట్టిన సమయంలో రాబర్ట్ బయటికి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కానీ వేగంగా వెళుతున్న కారు నుండి బయటకి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు కార్లను ఢీ కొన్న తర్వాత ఫెరారీ కారు ఏకంగా రెండు ముక్కలైంది. ఈ కారు కి ప్రమాదం ఎలా జరిగింది? రాబర్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారట. ఈ యాక్సిడెంట్ జరిగిన ఒక రోజు తర్వాత బయటికి వచ్చింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !