UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 దేశంలోని మహిళలకు వర్శిటీ విద్యపై నిషేధం

talibansఆప్ఘనిస్థాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. మహిళలు, బాలికలపై తాలిబన్ యంత్రాంగం ఆంక్షలు విధిస్తూనే వుంది. మహిళల హక్కులను అణచివేస్తోంది.
అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నా.. తాలిబన్లు మాత్రం పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా దేశంలోని మహిళలకు వర్శిటీ విద్యపై నిషేధం విధించారు. బాలికలు, మహిళలు ఇక యూనివర్శిటీల్లో అడుగుపెట్టకుండా బ్యాన్ విధించింది.

మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయండని… తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉత్తర్వులు అమలు చేయండని ఆప్ఘనిస్థాన్‍లోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్ లేఖరాశారు. ఈ లెటర్‌ను ఆ శాఖ ప్రతినిధి ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు.

మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించిన తాలిబన్‍ల నిర్ణయాన్ని చాలా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ ఇప్పటికే తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.

 

   TOP NEWS  

Share :

Don't Miss this News !