KA Paul : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ప్రజా శాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఐ విష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎ వెరీ హ్యపీ బర్త్ డే’ అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు కేఏ పాల్, ఏపీ ముఖ్యమంత్రికి. వైఎస్ జగన్‌కి దేవుడి దీవెనలు..
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దేవుడి ఆశీస్సులు వుండాలి’ అని పేర్కొన్న కేఏ పాల్ , రాష్ట్రానికి సైతం దేవుడి దీవెనలు అందలంటూ ప్రస్తావించారు. కేఏ పాల్, వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలోనూ కేఏ పాల్ పోటీ చేసి కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేకపోయారు.