UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 వీరసింహారెడ్డి నుంచి మూడో పాటకు ముహూర్తం ఫిక్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, పాటలు విడుదలై చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. వీరసింహారెడ్డి నుంచి మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి చిత్రం నుంచి మూడో పాటకు తేదీని ఫిక్స్ చేశారు. మా బావ

మనోభావాలు అంటూ సాగే ఈ పాటను డిసెంబరు 24న సాయంత్రం 3.10 గంటలకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా తెలియజేశారు. “న్యూ ఇయర్ పార్టీలో స్పీకర్లు పగిలిపోవాల, థియేటర్లలో మోత మోగిపోవాల” అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వీరసింహారెడ్డి చిత్రం నుంచి మూడో పాట విడుదలను గురించి తెలియజేసింది. డిసెంబరు 24 అంటే శనివారం సాయంత్రం 3.19 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి జై బాలయ్య, సుగుణ సుందరి పాటలు విడుదలై శ్రోతలను అలరించాయి. తాజాగా మూడో పాట కూడా అదే రేంజ్‌లో ఉంటుందని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకురుస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

   TOP NEWS  

Share :

Don't Miss this News !