UPDATES  

 ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశ వ్యాప్తంగా విస్తరించాలని కేసీఆర్ బయలుదేరారు. తన దయాది రాష్ట్రమైన ఏపీలో చాలా ఈజీగా విస్తరించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అదంత ఈజీగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తానొక ప్రత్యామ్నాయం అవుతానని కేసీఆర్ భావించారు. ఆయన అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పటికిప్పుడు ఆయనతో కలిసి నడిచే నాయకులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇది బీఆర్ఎస్ విస్తరణ అప్పుడే తేలిపోయింది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ శరవేగంగా జరుగుతోందని.. కీలక పార్టీల నాయకులు బీఆర్ఎస్ లోకి వస్తున్నట్టు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఏపీ ఇన్ చార్జిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నియమించడంతో ఆయన కీలక నేతలతో చర్చిస్తున్నారని కూడా టాక్ కనిపించింది. కానీ అదంతా ఉత్తమాటగా తేలిపోయింది. BRS In AP కేసీఆర్ ఇటీవల ఏపీలో బీఆర్ఎస్ తో కలిసి నడిచే నాయకులు ఎవరా అని ఆరాతీశారు. కానీ పొలిటికల్ నాయకులు ఆయనకు తారసపడేలేదు. రాజకీయాలను,కులాలను ప్రభావితం చేసే నాయకుల వేటలో పడ్డారు. ఈ సమయంలో నలుగురు, ఐదుగురు కుల సంఘాల ప్రతినిధులు తారసపడ్డారు. దీంతో వారికి తెలంగాణలోని ప్రగతి భవన్ నుంచి పిలుపువచ్చింది. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఏదో రకంగా రాజకీయం చేయాలని ఎదురుచూస్తున్నవారు ప్రగతి భవన్ కు సంతోషంగా వెళ్లి కేసీఆర్ ను కలిశారు ఏపీలో బీఆర్ఎస్ ను తాము లీడ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే వీరు ఎంతవరకు వర్కవుట్ చేస్తారని కేసీఆర్ కు తెలుసు.

అయినా ఏపీలో జెండా మోసేందుకు కొందరు కావాలన్నతలంపుతో వారితో కేసీఆర్ గ్రూప్ ఫొటొ దిగి సంతృప్తి చేసి పంపించేశారు. ఏపీలోని బీఆర్ఎస్ లో చేరుతున్న వారి జాబితాను హైకమాండ్ ప్రకటించింది. మీడియాకు లీకులిచ్చింది. రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు దివి కోటేశ్వరరావు, వలనుకొండ మల్లేశ్వరరావు, సామాజికవేత్త తోటకూర కోటేశ్వరరావు, స్వర్ణకారుల సంఘం నేత నాగేశ్వరరావు, బీసీ సంఘం నేత అంజన్ రావు బీఆర్ఎస్ లో చేరినట్టు ప్రకటించారు. అయితే ఏపీ రాజకీయాల్లో కానీ.. కుల సంఘాల యాక్టివిటీస్ లో కానీ వీరి పేరు పెద్దగా వినిపించలేదు. అయితే వీరికి పట్టుకొని ఏపీలో రాజకీయాలు చేస్తామంటే కుదరని పని. కానీ వీరు శాంపిళ్ల వరకే కానీ,.లోలోపల చాలామంది నాయకులు పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. BRS In AP ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ గ్రాండ్ గా ఉన్నట్టు ప్రచారం చేశారు. అందుకు అనుగుణంగానే విజయవాడలో భారీ కటౌట్లు వెలిశాయి. పార్టీ కార్యాలయాన్ని సైతం గుర్తించారు. ఒకరిద్దరు టీడీపీ పెద్ద నాయకులు చేరనున్నట్టు టాక్ నడిచింది. రాజకీయంగా ఫేడ్ అవుట్ అయిన చాలామంది నాయకులు బీఆర్ఎస్ తో యాక్టివ్ అవుతారని ప్రచారం చేశారు. అయితే ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఏపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు హాజరు కాకపోవడంతో అదంతా ట్రాష్ గా తేలిపోయింది. అంటే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ అంచనాలకు అందని దిగువస్థితిలోఉందని చెప్పొచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !