UPDATES  

 ఇడ్లీలతో టిక్కీలు.. సాయంత్రానికి స్పెషల్ స్నాక్..

ఇడ్లీలు పోషకాహారంగా చెప్తారు. అయితే ఉదయం వీటిని తింటే బాగుంటుంది. కానీ అవి మిగిలిపోతే సాయంత్రం వాటిని తినాలంటే ఏదోలా ఉంటుంది. అయితే వీటిని మరింత రుచిగా తీసుకోవాలంటే మీకోసం ఇక్కడో రెసిపీ ఉంది. అదే ఇడ్లీ టిక్కీ. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * ఇడ్లీ – 4-5 * బంగాళాదుంపలు – 1 కప్పు (ఉడికించినవి) * క్యారెట్ – 1 (తరిగినవి) * క్యాప్సికమ్ – 1 (తరిగినవి) * బఠాణీలు – అరకప్పు * కారం – 1 టీస్పూన్ * మిరియాలు – 1 టీస్పూన్ * ధనియాల పొడి – 1 టీస్పూన్ * కరివేపాకు – 1 రెబ్బ * ఆవాలు – 1

ఇడ్లీలతో టిక్కీలు.. సాయంత్రానికి స్పెషల్ స్నాక్..టీస్పూన్ తయారీ విధానం ఇడ్లీ టిక్కీ తయారు చేయడానికి.. ఓ గిన్నెలో ఇడ్లీలను తీసుకుని వాటిని ఒక గిన్నెలో వేసి పిండి చేయండి. దానిలో బంగాళాదుంపలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము, బఠాణీలు వేసి కలపండి. అనంతరం కారం, పెప్పర్ పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపండి. ఈ పిండితో చిన్న చిన్న టిక్కీలు తయారు చేసుకుని.. వేడి వేడి నూనెలో వేసి.. డీప్ ఫ్రై చేయండి. వాటిని క్రిస్పీగా, బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !