రామ్‌చరణ్ (Ramcharan)హీరోగా శంకర్ (Shankar)దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు దిల్‌రాజు (Dilaraju) దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం నుంచి రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం రామ్‌చరణ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కు సంబంధించిన సీన్స్‌ను దర్శకుడు శంకర్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ సాగనున్నట్లు తెలిసింది. రాజమండ్రితో పాటు వైజాగ్, కర్నూల్‌లలో కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో ఐఏఎస్ ఆఫీసర్‌గా, అవినీతిని ఎదురించే పోరాట యోధుడిగా డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో చరణ్ కనిపించనున్నట్లు తెలిసింది. జనవరి ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో చరణ్ లేకుండా ప్రధాన పాత్రలపై దర్శకుడు శంకర్ కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య విలన్‌గా నటించబోతున్నాడు. నవీన్‌చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రలను పోషించనున్నారు. పాన్ ఇండియన్ లెవల్‌లో తెలుగు, హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.