UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 బాలకృష్ణ భేటిలో చర్చకు వచ్చిన కీలక అంశాలు.

: ఒకరు మాస్‌కి కేరాఫ్ అడ్రెస్, మరొకరు అశేష జనసంద్రం ఉన్న స్టార్ హీరో.. వీరిద్దరు ఒకే ఫ్రేములో కనిపిస్తే అభిమానుల ఆనందం ఏం రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇంతకు ఆ హీరోలు ఎవరనే కదా మీ డౌట్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, నందమూరి నటసింహం బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణని ‘వీరసింహా రెడ్డి’ మూవీ సెట్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలవడం చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీతో పాటు అటు పొలిటికల్ సర్కిల్‌లోనూ వీరి కలయికపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణను పవన్ కల్యాణ్ ఇతర నటీ నటుల కలవగా, ఆ తర్వాత ఏకాంతంగా 20 నిమిషాల పాటు చర్చలు జరిపారని తెలుస్తుంది.ఆ చర్చలు దేని గురించి అని అందరిలో ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాలతో పాటు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగావ్యవహరిస్తున్నారు.

బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే కాగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అన్న విషయం తెలిసిందే.. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండగా రాజకీయం రోజురోజు వేడెక్కిపోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌.. బాలయ్యని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని చెబుతూ వస్తుండగా, ఆయన టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతుంది. Balakrishna And pawan kalyan meeting topic now ఈ రాజకీయ పరిణామాల మధ్య బాలయ్య-పవన్ కళ్యాణ్ భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది 20 నిమిషాల పాటు జరిగిన చర్చలలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ త్వరలో బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పాల్గొననున్నారు. పవన్ తో పాటు త్రివిక్రమ్ కూడా షోలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ డిసెంబరు 27న జరగనుందని తెలుస్తుంది. అయితే అంతకంటే ముందే… పవన్ బాలకృష్ణ కలవడం హాట్ టాపిక్ అయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !