UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 కరోనా విజృంభన…. సోను సూద్ కీలక ప్రకటన..!!

 

ప్రపంచంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే చైనాలో మూడు కోట్లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. చైనా ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. దీంతో చైనా హాస్పిటల్స్ మొత్తం కరోనా రోగులతో నిండిపోయాయి. ఇటువంటి పరిస్థితులలో భారత్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. విదేశీ ప్రయాణికులకు సంబంధించి ప్రతిచోట కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనా, హాంకాంగ్ ఇంకా కొరియా దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీఎస్ఆర్ టెస్ట్ చేస్తున్నారు. “BF 7” అనే కొత్త వేరియంట్.. వేగంగా విస్తరిస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ కరోనా కట్టడికి సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో కరోనా వచ్చిన ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేయని చాలా పనులు నటుడు సోను సూద్ చేయడం జరిగింది. 2020లో లాక్ డౌన్ సమయంలో… వలసదారులకు ప్రత్యేకమైన బస్సులు వాహనాలు ట్రైన్లు ఇంకా విమానాలు కూడా ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు చేర్చాడు. Sonu Sood About on Call Me old number దేశంలో ఏ మూలలో అయినా ఆక్సిజన్ లేక బాధపడుతున్న వాళ్లకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ కేసులు పెరుగుతూ ఉండటంతో సోనూసూద్ ఓ ప్రకటనతో అందరికీ భరోసా ఇచ్చాడు. తన పాత నెంబర్ పనిచేస్తూనే ఉందని… కోవిడ్ సాయం కోసం తనని సంప్రదించవచ్చు అని అన్నారు. సాయం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. సోను సూద్ కామెంట్ పై చాలామంది నేటిజన్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపద్బాంధవుడు మళ్ళీ రీఎంట్రీ అని కొనియాడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !