UPDATES  

 ప్రముఖ నటి షూటింగ్ స్పాట్‌లోనే బలవన్మరణానికి పాల్పడిన ఘటన

ప్రముఖ నటి షూటింగ్ స్పాట్‌లోనే బలవన్మరణానికి పాల్పడిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. అదే సమయంలో ఈ ఘటనపై చాలా అనుమానాలు తెరపైకొస్తున్నాయి. వివరాల్లోకి వెళితే టునీషా శర్మ అనే నటి, షూటింగ్ స్పాట్‌లో.. మేకప్ వేసుకుంటున్న సమయంలో ఆత్మహత్య చేసుకుంది. మేకప్ వేసుకుంటానని రూమ్‌లోకి వెళ్ళిన టునీషా శర్మ ఎంత సేపటికీ రాకపోవడంతో తలుపులు పగలగొట్టి చూశారు సిబ్బంది.

వాష్ రూమ్‌లో ఆత్మహత్య.. మేకప్ రూమ్‌కి ఆనుకుని వున్న వాష్ రూమ్‌లోకి వెళ్ళి అక్కడ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది టునీషా శర్మ. అయితే, ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నది తెలియరాలేదు. సూసైడ్ నోట్ లభ్యం కాలేదని ఈ కేసు విచారిస్తున్న పోలీసులు చెప్పారు. టునీషా శర్మ వయసు 20 ఏళ్ళు కాగా, ఆమె కొన్ని సినిమా ల్లో నటించింది. టెలివిజన్ సీరియల్స్‌లో ఆమె పాపులర్ యంగ్ యాక్ట్రెస్. ఆమెకు ఆర్థిక ఇబ్బందులు లేవనీ, కెరీర్ పరంగానూ సమస్యలు లేవని తోటి నటీనటులు చెబుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !