UPDATES  

NEWS

అచ్చం కిమ్ లెక్కనే బండి మాట… నా జీవితమంతా పోరాటమే –: సీఎం కేసీఆర్.. బుట్టబొమ్మ.. బతుకమ్మ.. అడవిలో అలజడి……మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ లు ఏజెన్సీలో సంచరిస్తున్న సమాచారంతో అప్రమత్తమైన పోలీస్ బృందాలు.. దిశ వెల్ఫేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ పంపిణీ. పది పరీక్షలకు సర్వం సిద్ధం.మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్… కార్యకర్తలపై దాడులకు దిగితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారు..? అంతా మాయజాలం మున్సిపాలిటీ టెండర్ వండర్ ఓ కంపెనీకి టెండర్ కట్టబెట్టడంలో మతలభేమిటి…? యువ సేవాసమితి అద్వర్యంలో పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు విద్యార్ధలకు బహుకరణ.. కూలిన కల్వర్టు అంచనాకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు..ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం..

 ముగిసిన ఐబీసీ ఆల్ట్‌ హ్యాక్‌ 2022

భారతదేశపు సుప్రసిద్ధ బ్లాక్‌చైన్‌, వెబ్‌ఎకోసిస్టమ్‌ బిల్డర్‌, ఐబీసీ మీడియా యొక్క ఆల్ట్‌ హ్యాక్‌ 2022 నేడు విజయవంతంగా వైజాగ్‌లో ముగిసింది. వెబ్‌ 3.0 శక్తిని వినియోగించుకోవడంతో పాటుగా రివార్డింగ్‌ కెరీర్‌ కోసం విద్యార్థులను సిద్ధం చేసే వేదికగా ఇది నిలిచింది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు బ్లాక్‌చైన్‌, వెబ్‌ 3.0లలో దాదాపు 2వేల మందికి కీలకమైన పరిశ్రమ నిపుణులు శిక్షణ అందించడంతో పాటుగా ఫంక్షనల్‌, టెక్నాలజీ స్టాక్స్‌పై శిక్షణ అందించారు. పరిశ్రమ నిపుణులు, వెబ్‌3.0 పయనీర్‌ పోల్కాడాట్‌ నుంచి 75కు పైగా ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు శిక్షణ పొందారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఏపీఐఎస్‌, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ, టెక్‌ మహీంద్రా మద్దతు అందించాయి.

ఈ కార్యక్రమ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈఓ టి. అనిల్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఐబీసీ మీడియా సీఈఓ ఫౌండర్‌ అభిషేక్‌ పిట్టి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ, ”విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు సరైన సమయంలో ఈ కార్యక్రమం వచ్చింది. దీనిద్వారా వెబ్‌ 3.0 డెవలపర్ల కొరత తీరనుంది. ఈ తరహా కార్యక్రమాలకు ప్రభుత్వం తోడుండటంతో పాటుగా విద్యార్థులకు సహాయపడనుంది” అని అన్నారు. ఈ హ్యాక్‌లో 25 టీమ్‌లకు చెందిన 200 మంది అభ్యర్థులు తమ ఆలోచనలను న్యాయనిర్ణేతలతో పంచుకున్నారు. ఈ టీమ్‌లకు ఐబీసీ మీడియా మెంటార్లు తగిన మార్గనిర్ధేశనం చేశారు. ఐబీసీ మీడియా సీఈఓ-ఫౌండర్‌ అభిషేక్‌ పిట్టి మాట్లాడుతూ, ”ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం చూపాలని మేము భావిస్తున్నాము. అలాగే వాస్తవ ప్రపంచపు సమస్యలకు తగిన పరిష్కారాలను అందించేలా వారి విద్యా అభ్యాసాలకు తగిన పరీక్షలనూ పెడుతున్నాము. వెబ్‌ 3.0 కోసం భారతదేశాన్ని సిద్ధం చేయాలనేది మా లక్ష్యం” అని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !