జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న వాళ్లు ఆ తర్వాత కొంత కాలానికి జబర్దస్త్ ని వీడి వెళ్ళి పోతున్నారు. బయట రంగుల ప్రపంచం ఉందని భావించి కొత్త ఆఫర్స్ కోసం వెళుతున్న వారు ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. పలువురు కమెడియన్స్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. ఇప్పుడు అదే ఇబ్బందిని యాంకర్ అనసూయ పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నటిగా బిజీ బిజీగా ఉన్నా అనసూయ డేట్లు కేటాయించలేక పోతున్నాను అంటూ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసిన తర్వాత అనసూయ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుందని ఆమె సినిమాలతో అభిమానులు తడిసి ముద్ద అవుతారని అంతా భావించారు, కానీ ఇప్పటి వరకు ఆమె ఏ ఒక్క సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయింది. అలాగే కొత్త సినిమాలకు కమిట్ అయిన దాకలాలు కూడా కనిపించడం లేదు.
గత మూడు నెలలుగా అనసూయ ఏం చేస్తుంది.. ఎక్కడుంది అనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. సోషల్ మీడియాలో కూడా ఇంతకు ముందు ఆమె చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి కాస్త తారుమారు అయ్యింది. anasuya fans searching for her movies and shows మూడు నెలలుగా ఆమె ఎక్కడా కనిపించక పోవడంతో అభిమానులు బిక్కు బిక్కుమంటున్నారు. అనసూయ మేడం దర్శనం ఎప్పటికీ అవుతుంది అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఆమెకు జబర్దస్త్ నుండి పిలుపు రాలేదు. ఇక ముందు కూడా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే సౌమ్య రావు.. అనసూయ ప్లేసులో సెటిల్ అయిపోయింది. ఆమెకు మంచి అవకాశాలు వీలుందంటూ మల్లెమాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.