మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో పెద్దన్న అనడం ఎలాంటి సందేహం లేదు. అలాగే వారి ఇంటికి కూడా ఆయన పెద్ద. ఆయన వ్యక్తిగత విషయాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన చిన్న కూతురు శ్రీజ తన రెండవ భర్తకి కూడా దూరంగా ఉంటుందని ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ విషయాన్ని అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తన కూతురు తనకు కావాల్సిందే అంటే న్యాయ పోరాటానికి దిగుతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.చిరంజీవి ఫ్యామిలీ మాత్రం ఆ పాపను తమ వద్దే ఉంచుకోవాలని చూస్తున్నారట.
తన కూతురు తన వద్ద ఉండాలని కళ్యాణ్ దేవ్ విజ్ఞప్తి చేస్తున్నాడట. ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. కానీ చాలా రోజులుగా ఈ విషయం నానుతూ వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. న్యాయ పోరాటం చేస్తే ఏం జరుగుతుంది అంటూ ఈ మధ్య కాలంలో కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇందులో నిజం లేదు అంటూ మెగా సన్నిహితులు చెప్తున్నారు. Chiranjeevi Family issue goes viral news సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేస్తున్నారని, అసలు ఇప్పటి వరకు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్న విషయం కూడా క్లారిటీ లేదంటూ వారు చెప్తున్నారు. ఇలాంటి పిచ్చి పుకార్లు ప్రచారం చేయడం కంటే పెద్ద తప్పు మరోటి ఉండదు. చిరంజీవి కూతురు అనగానే చాలా మంది ఆసక్తి చూపిస్తారు అనే ఉద్దేశ్యంతో కొందరు మీడియా వారు ఇష్టానుసారంగా కథనాలు రాసేస్తూ ఆ తర్వాత నిజం కాదంటా అన్నట్లుగా సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు న్యాయ పోరాటం విషయం కూడా పూర్తి గా అవాస్తవం అయ్యి ఉంటుంది.