యాంకర్ సుమ … యాంకరింగ్ కి గుడ్ బై చెబుతున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. అయితే ఈ వార్తలకి యాంకర్ సుమ వీడియో రూపంలో ఇంస్టాగ్రామ్ లో క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఆమె ఏమంది అంటే…”ఇటీవల ఓ న్యూ ఇయర్ ఈవెంట్ షూట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ కి సంబంధించి ప్రోమో ఇటీవల రిలీజ్ అయింది. ఆ ప్రోమో వైరల్ అవుతూ ఉంది. అందులో తాను ఎమోషనల్ అయింది వాస్తవమే. అయితే మొత్తం ఈవెంట్ చూస్తే అసలు విషయం ఏమిటో అర్థమవుతుంది. కంగారు పడకండి నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. మెసేజ్ లు పెడుతున్నారు. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నది ఏమిటంటే…
నేను టీవీ కోసమే పుట్టా. నేను ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టా.. నేను ఎటు వెళ్లడం లేదు. కాబట్టి మీరు హాయిగా ఉండండి. హ్యాపీగా ఉండండి. మీ అందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు అని సుమ తాను యాంకరింగ్ వీడటం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో యాంకర్ సుమ…\యాంకరింగ్ కి గుడ్ బై చెప్పినట్లు వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కార్యక్రమాలను చాలా అలవోకగా… హ్యాండిల్ చేయటంలో యాంకర్ సుమ దిట్ట. అటువంటిది ఆమె యాంకరింగ్ నుండి తప్పుకున్నట్లు.. వచ్చిన వార్తలకు ఒకసారిగా ఆమె అభిమానులు సినీ ప్రేమికులు షాక్ అయ్యారు. అయితే ఈ న్యూస్ వైరల్ అవుతూ ఉండటంతో తనకి ఫోన్లు రావడంతో సుమ.. తాను ఎంటర్టైన్మెంట్ మరియు టీవీ ఫీల్డ్ వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.