టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పాపులారిటీని సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న సమంత ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ కనిపించకుండా పోయింది. ఆమె కమిట్ అయిన సినిమాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి, కొన్ని సినిమాలు ప్రారంభం కాకుండానే క్యాన్సల్ అయ్యాయి. సమంత ఆరోగ్య పరిస్థితి ఏంటి.. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆ మధ్య కొరియాకు సమంత చికిత్స నిమిత్తం వెళ్ళింది అంటూ ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం ఏంటి అంటే సమంత అసలు చికిత్స నిమిత్తం ఏ దేశానికి వెళ్లలేదట. అంతే కాకుండా ఆమె హైదరాబాదులోనే ఉందని అన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికి కూడా హైదరాబాదులోనే ఉందని, ఆమెకు ఇంటి నుండే వైద్యులు చికిత్సను అందిస్తున్నారని తెలుస్తోంది.
జనవరి లో ఆమె షూటింగ్ లకు హాజరయ్యే విధంగా వైద్యులు ఆమెను ట్రీట్ చేస్తున్నారంటూ సమాచారం అందుతుంది. మొదటగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో సమంత నటించాల్సి ఉంది. Samantha latest health update and where she is ఆ తర్వాత హిందీ సినిమాలతో పాటు ఇంగ్లీష్ సినిమా ను కూడా ఆమె చేయబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాలలో సమంత నటిస్తోంది. కనుక కచ్చితంగా ఆమె మరో సారి సందడి చేయడం ఖాయం. 2023 మరియు 24 లో సమంత బిజీ బిజీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అనారోగ్య సమస్యల నుండి బయట పడితే కచ్చితంగా సమంత హీరోయిన్ గా మళ్లీ బిజీ అవుతుందని ఆమెతో కలిసి వర్క్ చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.