UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 సమంత ఆరోగ్యం గురించి కొత్త అప్డేట్‌

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పాపులారిటీని సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న సమంత ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ కనిపించకుండా పోయింది. ఆమె కమిట్ అయిన సినిమాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి, కొన్ని సినిమాలు ప్రారంభం కాకుండానే క్యాన్సల్ అయ్యాయి. సమంత ఆరోగ్య పరిస్థితి ఏంటి.. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆ మధ్య కొరియాకు సమంత చికిత్స నిమిత్తం వెళ్ళింది అంటూ ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం ఏంటి అంటే సమంత అసలు చికిత్స నిమిత్తం ఏ దేశానికి వెళ్లలేదట. అంతే కాకుండా ఆమె హైదరాబాదులోనే ఉందని అన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికి కూడా హైదరాబాదులోనే ఉందని, ఆమెకు ఇంటి నుండే వైద్యులు చికిత్సను అందిస్తున్నారని తెలుస్తోంది.

జనవరి లో ఆమె షూటింగ్‌ లకు హాజరయ్యే విధంగా వైద్యులు ఆమెను ట్రీట్ చేస్తున్నారంటూ సమాచారం అందుతుంది. మొదటగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో సమంత నటించాల్సి ఉంది. Samantha latest health update and where she is ఆ తర్వాత హిందీ సినిమాలతో పాటు ఇంగ్లీష్ సినిమా ను కూడా ఆమె చేయబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాలలో సమంత నటిస్తోంది. కనుక కచ్చితంగా ఆమె మరో సారి సందడి చేయడం ఖాయం. 2023 మరియు 24 లో సమంత బిజీ బిజీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అనారోగ్య సమస్యల నుండి బయట పడితే కచ్చితంగా సమంత హీరోయిన్ గా మళ్లీ బిజీ అవుతుందని ఆమెతో కలిసి వర్క్ చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !