ఆరోగ్యకరమైన ఆపిల్ బటర్ రెసిపీతో మీ రోజును ప్రారంభించండి. ఎందుకంటే ఇవి రుచితో పాటు మీకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతేకాకుండా పిల్లలు దీనిని ఇష్టంగా తింటారు. వీటిని మీరు బ్రెడ్ లేదా పాన్‌కేక్‌లకు మరింత రుచిని ఇవ్వడం కోసం.. టాపింగ్‌గా ఉపయోగించవచ్చు. అయితే ఈ రుచికరమైన ఆపిల్ బటర్ రెసిపీని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో?
ఎలా దీనిని తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * కారామెల్ ఫ్లేవర్డ్ సిరప్ – 2-3 టేబుల్ స్పూన్లు * నీరు – 1 కప్పు * జాజికాయ పొడి – 1/2 టీస్పూన్ * దాల్చిన చెక్క పొడి – 1 టీస్పూన్ * యాపిల్స్ – 4-5 (పై తొక్క తీసేసి.. ముక్కలుగా కట్ చేసుకోవాలి) తయారీ విధానం.. ముందుగా పాన్ తీసుకుని.. అన్ని పదార్థాలు వేసి.. తక్కువ మంట మీద ఉడికించాలి. 30 నిమిషాలు ఉడికించి.. మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోండి. అంతే యాపిల్ బటర్ రెడీ. దీనిని టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలపై రాసి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం.