తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు పలుకుతున్నారు. తమ సొంత గ్రామాల్లో తానా సభ్యులు అసహాయులకు, విద్యార్థులకు చేస్తున్న సేవలను అందరూ కొనియాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తానా సభ్యులు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ ప్రభుత్వ పాఠశాలలకు కాలినడకన 6 కి.మీలు నడిచి వస్తున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసి తన ఉదారత చాటుకున్నాడు తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ. ఖమ్మం రఘునాధపాలెం మండలంలోని. వి. వెంకటాయపాలెం హైస్కూలులో 6 కిలోమీటర్లు దూరం నుండి నడిచి వచ్చే ఆరుగురు బాలికలకు ‘తానా ఆదరణ’ కార్యక్రమంలో 6 సైకిళ్ళు అందజేశారు.
పాఠశాల లో జరిగిన ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మైన్ యార్లగడ్డ వెంకట రమణ గారు సైకిళ్ళుతో పాటు 10తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఎక్సామినేషన్ కిట్స్ అందజేసారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్ బండి నాగేశ్వరరావు గారు, ఇతర తానా ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు. విద్యార్థులు తానా చేస్తున్న కృషికి వితరణకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. సైకిళ్లు అందుకున్న వారిలో నగర శివారు వెలుగుమట్ల సాగర్ కాల్వపై నివసించే ఐదుగురు, వేపకుంట్లకు చెందిన ఒక విద్యార్థిని ఉన్నారు. వీరు ఈ పాఠశాలలో ఆరు, ఏడు తరగతులు చదువుతున్నారు. వారు పాఠశాలకు వచ్చివెళ్లేలా ఉపయోగపడేందుకు తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ చేతుల మీదుగా సైకిళ్లు అందించారు.