UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 TDP ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ ఘనవిజయం

ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ ఘనవిజయం సాధించడంతో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరోసారి సత్తా చాటుతున్నట్లు కనిపిస్తోంది. విభజనకు ముందు తెలంగాణలో ఎన్నో ప్రాంతాలు టీడీపీకి కంచుకోటగా ఉండేవి కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ అనూహ్యంగా కనుమరుగైంది. అయితే, నారా చంద్రబాబు నాయుడు చేతిలో ప్రస్తుతం ఒక చక్కటి అవకాశం వచ్చి పడింది.తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడంతో, ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా మళ్లీ అవతారమెత్తేందుకు టీడీపీకి అతిపెద్ద అవకాశమే దొరికింది.

ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ఢీకొట్టేందుకు భారీ స్కెచ్ను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుండి ఏకపక్ష మద్దతును పొందేది అన్న విషయం విదితమే. చివరికి వారి మద్దతును తిరిగి పొందడమే ఇప్పుడు బాబు వేయబోయే మొదటి స్కెచ్ అట.వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పెద్దపీట వేసేందుకు తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి సాయం అందితే కొంత మంది తెలుగు పెద్దలను కలవాలని, కొన్ని విషయాలపై హామీ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కనీసం 5-10 సీట్లు కైవసం చేసుకోవాలని, తద్వారా తెలంగాణలో మరలా వారు పుంజుకోవాలని టిడిపి పార్టీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.టిడిపి కి ఇంతకు ముందు నుండే ఒక బలమైన క్యాడర్ ఉన్నందున, చంద్రబాబు ఈ ప్లాన్ ను సరిగ్గా అమలు చేస్తే ఖచ్చితంగా పనులు జరగవచ్చు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజల నుండి వచ్చే అనేక ప్రశ్నలకు ఆ పార్టీ మాత్రం సమాధానం చెప్పాలి. అలా వారు భరోసా, హామీ, నమ్మకం ఇచ్చి, ఇండస్ట్రీ మద్దతు పొందగలిగితే రాబోయే రోజుల్లో రసవత్తర పోరు ఖాయం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !