UPDATES  

 షర్మిల దూకుడు.. బీజేపీ పై అవినీతి అస్త్రాలు!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) రూటు మార్చింది. నిత్యం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని మాటల దాడికి దిగేది. ఈ క్రమంలో ఇటీవల షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసిన తీరుపై విమర్శలొచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ సైతం షర్మిలకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) ‘బీజేపీ బాణం’ అంటూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల తన వ్యూహాలను మార్చుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఇద్దరూ ఒకరితో ఒకరు చేతులు కలుపుకున్నారని, BRS, BJP పార్టీలపై విమర్శలు చేశారు. అయితే కేసీఆర్ అవినీతిని బయటపెడతానని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఇతర నేతలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

”కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటామని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎటువంటి చర్యలు లేవు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నేతలు కేవలం మాటలకే పరిమితమయ్యారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేసీఆర్ అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నా, బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోదు” అని షర్మిల (YS Sharmila) ఆరోపించారు. కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టులో అవినీతిపై కేంద్రానికి టన్నుల కొద్దీ ఆధారాలు సమర్పించానని ఆమె సూచించారు. ”కేసీఆర్ కేంద్ర నిధుల ఏజెన్సీల నుంచి కోట్లాది రూపాయలు అప్పుగా తీసుకుని భారీగా మోసం చేశారు. అయినా బీజేపీ ఎలాంటి విచారణకు ఆదేశించదు” అని షర్మిల విమర్శించారు. “కేసీఆర్ దోచుకున్న దోపిడిలో బీజేపీ నేతలకు వాటా ఉండవచ్చు” అని (YS Sharmila) ఆమె ఆరోపించడం చర్చనీయాంశమవుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !