పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. దానికి ‘ఆటో జానీ’ అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టుకున్నాడు పూరి జగన్నాథ్. ‘ఖైదీ నెంబర్ 150’ స్థానంలో రావాల్సిన సినిమా అది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది వెనక్కి వెళుతూ వెళుతూ వుంది. ‘సైరా నరసింహా రెడ్డి’ సమయంలోనూ, ‘ఆటో జానీ’ అంశం తెరపైకొచ్చింది.
అప్పుడూ కుదరలేదది. ‘గాడ్ ఫాదర్’ మళ్ళీ కెలికిన వైనం.. ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్లలో పూరి జగన్నాథ్‌ని ‘నా ఆటో జానీ కథ ఏమయ్యింది.?’ అని చిరంజీవి స్వయంగా అడిగిన సంగతి తెలిసిందే. ‘ఇంకో కథ సిద్ధం చేస్తాను సర్.. ఆ కథ అలాగే వుంది..’ అని చెప్పాడు పూరి. తాజాగా పూరి ఓ కథ మీద వర్క్ చేస్తున్నాడనీ, అది చిరంజీవి కోసమేనని అంటున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ రిజల్ట్ చూశాక చిరంజీవి, ఆ కథ వైపు వెళ్ళాలా.? వద్దా.? అన్నది డిసైడ్ చేస్తాడట. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.