UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 నరేష్-పవిత్రా లోకేష్ Real లిప్ కిస్

నరేష్ పవిత్ర లోకేష్.. ఈ ఏడాది వీరి పేరు సోషల్ మీడియాలోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ మొదటి నుండి కలిసి తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు కానీ రోజురోజుకు వీరి మీద వార్తలు ఎక్కువగా రావడంతో ప్రతి ఒక్కరు వీరి పైన ఫోకస్ పెట్టారు. అంతేకాదు వీరిద్దరూ పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తున్నట్టు ఎన్నోసార్లు నిర్ధారణ జరిగింది.అలాగే ఈ సీన్లోకి నరేష్ (Naresh) మూడో భార్య రమ్య రఘుపతి కూడా ఎంట్రీ ఇచ్చి నాకు విడాకులు ఇవ్వకుండా వేరే వ్యక్తితో ఎలా కలిసి ఉంటారు అంటూ నానా రచ్చ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక నరేష్ పై ఎన్ని వార్తలు వచ్చినా కూడా పవిత్ర లోకేష్ ని వదిలిపెట్టకుండా తన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో పవిత్ర లోకేష్ ని కూడా తీసుకొని వచ్చి భార్యాభర్తలు లాగే ఉన్నారు.

అలాగే ఇటీవల కృష్ణ (Krishna) గారు మరణించినప్పుడు కూడా పవిత్ర లోకేష్ నరేష్ భార్య భర్తల లాగే అన్నింటిలో పాల్గొన్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే.. పవిత్ర లోకేష్ నరేష్ (Naresh-pavitra Lokesh) పై కావాలనే కొంతమంది వెబ్సైట్ వాళ్లు తప్పుడు వార్తలు రాస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంతే కాదు తెర వెనుక ఉండి వీరితో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) కావాలనే ఇలా తప్పుడు రాతలు రాయిస్తోందని ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసి మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక ఘాటు లిప్ లాక్ ఇచ్చుకున్న ఒక వీడియోని షేర్ చేశారు నరేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే నరేష్ పవిత్ర లోకేష్ (Pavithra Lokesh) ఇలా చేయడానికి ప్రధాన కారణం వీరిపై వస్తున్న వార్తలే అని తెలుస్తోంది. ఇప్పటికే వీరి మీద అక్రమ సంబంధం మెయింటైన్ చేస్తున్నారు అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !