ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్స్ అధిక పెన్షన్ ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ (Higher Pension) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధిక పెన్షన్ పొందడానికి ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లకు నిబంధనలు, షరతుల్ని నిర్దేశించింది. అధిక పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరించింది. ఎనిమిది వారాల వ్యవధిలో సుప్రీంకోర్టు తీర్పును ఫండ్ అధికారులు అమలు చేయాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. 1995 పథకంలోని పేరా 11(3)లో ముందుగా ఉన్న ఈపీఎఫ్ఓ ఆదేశాలకు లోబడే ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కింది ఈపీఎఫ్ఓ చందాదారులు అధిక పెన్షన్‌కు అర్హులు అని ఈపీఎఫ్ఓ సర్క్యులర్ స్పష్టం చేసింది.
గుడ్ న్యూస్… పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకున్నవారికి భారీగా వడ్డీ పెంపు 1. రూ.5,000 లేదా రూ.6,500 కంటే ఎక్కువ వేతనం ఉన్నప్పుడు ఈపీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ చేసినవారు. 2. EPS-95లో సభ్యులుగా ఉండగా, ముందస్తు సవరణ పథకం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద ఉమ్మడి ఎంపికను వినియోగించుకున్న EPFO సబ్‌స్క్రైబర్. 3. ఈపీఎఫ్ఓ సభ్యుడు అటువంటి ఆప్షన్ ఎంచుకుంటే ఈపీఎఫ్ఓ తిరస్కరించినప్పుడు. అధిక పెన్షన్‌కు ఎలా అప్లై చేయాలి? అర్హత కలిగిన ఈపీఎస్ సభ్యులు సంబంధిత ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి, అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్లికేషన్ సమర్పించాలి. కమిషనర్ పేర్కొన్న విధంగా అప్లికేషన్ ఉండాలి. ధ్రువీకరణ కోసం దరఖాస్తు ఫామ్ పైన ప్రభుత్వ నోటిఫికేషన్‌లో ఆదేశించిన విధంగా డిస్‌క్లెయిమర్ ఉండాలి. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ నుంచి పెన్షన్ ఫండ్‌కి డబ్బులు సర్దుబాటు అవసరమయ్యేలా ఉంటే, పెన్షనర్ స్పష్టమైన సమ్మతి కావాలి. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నుంచి ఈపీఎఫ్ఓ పెన్షన్ ఫండ్‌కు నిధులను బదిలీ చేసిన సందర్భంలో, ట్రస్టీ యొక్క అండర్‌టేకింగ్ సమర్పించబడుతుంది.