UPDATES  

 స్వీట్స్ తింటే ఆరోగ్యకరమే.. ఇలాంటి మార్పులు చేసుకుంటే

ఇది హాలిడే సీజన్.. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి వేడుకలు చేసుకునే సమయం. అయితే పార్టీ ఏదైనా స్వీట్స్ తినిపించడం, కేక్ తినిపించడం ఉంటుంది. ఈ సమయంలో స్వీట్లు తినడానికి చాలా టెంప్టేషన్ కూడా ఉంటుంది. కానీ ఈ స్వీట్లను తినడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఎక్కువ చక్కెర కడుపులో యాసిడ్ ఉత్పత్తికి దారి తీస్తుంది, ఇది మీ దంతాలను దెబ్బతీస్తుంది. మన ఇంట్లో తయారు చేసుకునే సాంప్రదాయ స్వీట్లను నాణ్యమైన ఆరోగ్యకరమైన పదార్ధాలతో తయారు చేసుకుంటాం. అయినప్పటికీ, వాటిని కూడా మితంగా తినాలి. HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ముగ్ధ ప్రధాన్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చిట్కాలు అందించారు. పండుగల సీజన్‌లో స్వీట్స్ తినాలనే కోరికను అణుచుకోలేనపుడు, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. న్యూట్రిషనిస్టులు ఇచ్చిన సూచనలు చూడండి. 1. సేంద్రీయ పిండి: శుద్ధి చేసిన పిండి స్థానంలో కొబ్బరి పిండి, రాగుల పిండి, సేంద్రీయ ఓట్స్ పిండి వంటి ఆరోగ్యకరమైన పిండి రకాలను ఉపయోగించాలి. మైదా వంటి శుద్ధి చేసిన పిండి రక్తంలో చక్కెరను గణనీయంగా పెంచుతుంది, ఇది అధిక మొత్తంలో గ్లూటెన్‌ను కలిగి ఉంటుంది, ఇది ప్రేగులకు చాలా హానికరం.

కాబట్టి బాగా శుద్ధి చేసిన పిండి రకాలను ఎంచుకోవద్దు. 2. తాజా తేనె: శుద్ధి చేసిన చక్కెర స్థానంలో ముడి తేనెను ఉపయోగించడం ఉత్తమం. తేనే తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెరను ఎక్కువగా పెంచకుండా చేస్తుంది. తాజా తేనె అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. 3. కొబ్బరి పాలు: మీ డెజర్ట్‌లను మరింత ఆరోగ్యవంతంగా చేయడానికి మీరు పాశ్చరైజ్డ్ పాలకు బదులుగా స్వచ్ఛమైన కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు. పాశ్చరైజ్డ్ పాలు కడుపులో మంటను కలిగిస్తుంది, జీర్ణక్రియకు అంతరాయాలను కలిగిస్తుంది. 4. నెయ్యి, వెన్న లేదా కొబ్బరి నూనె: స్వీట్స్ తయారీలో రీఫైన్డ్ నూనెలకు బదులుగా నెయ్యి, వెన్న లేదా శుద్ధమైన కొబ్బరి నూనెను ఉపయోగించండి. మామూలు నూనెలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి, దుకాణాల్లో కొనుగోలు చేసిన స్వీట్లు అనారోగ్యకరమైనవి కావడానికి ఇదే అతిపెద్ద కారణం. సాంప్రదాయకంగా అధిక కొవ్వు కలిగిన స్వీట్లు, లడ్డూలు, హల్వా, కేకులు, ఐస్ క్రీములు, పుడ్డింగ్‌లు మొదలైన డెజర్ట్‌లు అన్నీ నెయ్యి, వెన్న, హెవీ క్రీమ్ లేదా కొబ్బరి నూనెను ఉపయోగించి తయారు చేయాలి. 5. సహజ రుచులు: రుచుల విషయానికి వస్తే, స్వీట్స్ తయారీదారులు ఫ్లేవర్స్ కోసం కృత్రిమ కలర్స్, ఫ్లేవర్స్ కలుపుతారు. బదులుగా ఏలకులు, దాల్చినచెక్క, కుంకుమపువ్వు మొదలైన వాటితో ఫ్లేవర్ చేయవచ్చు, కృత్రిమ రుచులు చాలా హానికరం. 6. డ్రై ఫ్రూట్స్: స్వీట్లను తయారు చేయడమే కాకుండా, మనం ప్రత్యామ్నాయంగా అత్తి పండ్లను, ఖర్జూరం, ఆప్రికాట్లు, ఎండుద్రాక్ష, బెర్రీలు మొదలైన డ్రై ఫ్రూట్స్‌ని కూడా తీసుకోవచ్చు. వీటిలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి, ఇవి తింటే ఆరోగ్యకరం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !