UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 శాకుంతలం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌

టాలీవుడ్‌లో మోస్ట్‌ అవేటెడ్‌ మూవీస్‌లో ఒకటి శాకుంతలం. సమంత, గుణశేఖర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్‌ సోమవారం (జనవరి 2) అనౌన్స్‌ చేశాడు. ఈ శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్‌ కాబోతోంది. 3డీ వెర్షన్ కోసమంటూ గతేడాది రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేసిన మేకర్స్‌.. ఈసారి ఆ వెర్షన్‌లోనూ ఈ విజువల్‌ వండర్‌ను చూడొచ్చని అనౌన్స్‌ చేశారు. మూవీ రిలీజ్‌ డేట్‌ను సమంత కూడా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. “అద్భుతమైన లవ్‌స్టోరీ శాకుంతలం మూవీని థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండి. ఫిబ్రవరి 17న 3డీలోనూ ఈ సినిమా మీ ముందుకు వస్తోంది” అని సమంత ట్వీట్‌ చేసింది. ఈ సినిమాలో మలయాళం న

టుడు దేవ్‌ మోహన్‌.. దుశ్యంతుని పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం రచన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ పాన్‌ ఇండియా మూవీ ఫిబ్రవరి 17న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలలో పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. నిజానికి గతేడాది చివర్లో రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ మొదట ప్రకటించారు. అయితే 3డీ వెర్షన్‌ కూడా తెస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు ఆ వెర్షన్‌ను కూడా సిద్ధం చేసి ఒకేసారి 2డీ, 3డీల్లో రిలీజ్‌ చేయనున్నారు. గుణశేఖర్‌ కూతురు నీలిమా గుణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. గుణ టీమ్‌వర్క్స్‌ బ్యానర్‌ కింద తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ కింద దిల్ రాజు సమర్పిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్‌ అందించాడు. ఈ మధ్యే యశోద మూవీతో హిట్‌ అందుకున్న సమంత.. ఇప్పుడు మరోసారి శాకుంతలంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్వరలోనే మేకర్స్‌ మూవీ ప్రమోషన్లను ప్రారంభించనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !