మీరు గ్రీన్స్ను మీ ఆహారంలో చేర్చుకోవాలంటే.. గ్రీన్ రైస్ తినొచ్చు. ఒరెగానో, పార్స్లీ, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వంటి గ్రీన్స్తో కలిపి చేసే ఈ రైస్ మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఇది టేస్టీగా ఉంటుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * ఒరేగానో – రుచి కావాల్సినంత * స్ప్రింగ్ థైమ్, పార్స్లీ – కొంచెం * కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్లు * పెప్పర్ – రుచికి తగినంత * చిల్లీ ఆయిల్ – 2 స్పూన్లు * వెజిటెబుల్ స్టాక్ – 1 కప్పు * స్ప్రింగ్ ఆనియన్స్ – 3 * ఉల్లిపాయ – 1 * వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్ * జీలకర్ర పొడి – 1 టేబుల్ స్పూన్ * జలపెనోస్ – 1 కప్పు * క్యాప్సికమ్ – 1 గ్రీన్ * బియ్యం – 1 కప్పు * గ్రీన్ ఆలివ్స్ – 8 * సన్ ఫ్లవర్ విత్తనాలు – కొన్ని (మొలకెత్తినవి) తయారీ విధానం థైమ్, ఒరేగానో, పార్స్లీ, కొత్తిమీర, ఉప్పు, పెప్పర్, ఆలివ్స్, వెజిటబుల్ స్టాక్, స్ప్రింగ్ ఆనియన్‌లను బ్లెండర్‌లో వేసి బాగా బ్లెండ్ చేసి ప్యూరీలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో చిల్లీ ఆయిల్ వేసి.. వేడి చేసి దానిలో ఉల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. దానిలో జీలకర్ర పొడి, తరిగిన జలపెనో, ఉప్పు, మిరియాలు వేసి బాగా కలపండి. ఇప్పుడు దానిలో బియ్యం వేసి.. కూరగాయల స్టాక్ వేయాలి. దానిని కప్పి ఉడకనివ్వండి. దానిలో గ్రీన్ ప్యూరీ, గ్రీన్ బెల్ పెప్పర్, గ్రీన్ ఆలివ్ వేసి బాగా కలపండి. దీన్ని బాగా టాస్ చేసి వేడిగా సర్వ్ చేసుకోండి. మీకు నచ్చిన కర్రీతో, రైతాతో కలిపి తినేయండి.