UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 బిగ్ బాస్ శ్రీహాన్ పెళ్లి

శ్రీహాన్-సిరి హన్మంత్ చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు. యూట్యూబ్ వేదికగా ఇద్దరికీ బంధం కలిసింది. షార్ట్ ఫిల్మ్స్, డాన్స్ వీడియోలు కలిసి చేస్తున్న సమయంలో మనసులు ముడి పడ్డాయి. తమ ప్రేమను వీరిద్దరూ బహిరంగంగానే ప్రకటించారు. బిగ్ బాస్ సీజన్ 5లో సిరి పాల్గొన్నారు. ఆమె ఫైనల్ కి కూడా వెళ్లారు. అప్పుడు సిరి కోసం బిగ్ బాస్ వేదికపైకి శ్రీహాన్ వచ్చాడు. ఆ నెక్స్ట్ సీజన్ శ్రీహాన్ బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ కొట్టేశాడు. సీజన్ 6 రన్నర్ గా నిలిచిన శ్రీహాన్ సక్సెస్ వెనుక సిరి ఉందనేది నిజం. ఫ్యామిలీ వీక్లో సిరి హౌస్లోకి వెళ్ళింది. శ్రీహాన్ ఆటలోని తప్పొప్పులు వివరించి మంచిగా గైడ్ చేసింది. Srihan Siri Marriage సిరి వచ్చి వెళ్ళాక శ్రీహాన్ గేమ్లో చాలా మార్పు వచ్చింది. అలాగే బయట ఉండి శ్రీహాన్ కోసం క్యాంపైన్ చేసింది. శ్రీహాన్ టెంప్ట్ కాకపోతే ఏకంగా టైటిల్ కొట్టేవాడు. ఆత్మవిశ్వాసం లోపించడం, పేరెంట్స్, ఫ్రెండ్స్ రూ. 40 లక్షల క్యాష్ తీసుకొమ్మని మోటివేట్ చేయడంతో రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు.

నాగార్జున ఆఫర్ కి ఒప్పుకొని సూట్ కేసు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. రన్నర్ అయినప్పటికీ… శ్రీహాన్ రూ. 45 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకున్నాడు. అలాగే ఒప్పందం ప్రకారం 15 వారాలు హౌస్లో ఉన్నందుకు మరికొంత డబ్బు, రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడు. కాగా షో ద్వారా వచ్చిన డబ్బు నుండి లవర్ సిరికి గిఫ్ట్ ఇవ్వాలని శ్రీహాన్ చెప్పాడు. ఇప్పటివరకు నేను చెప్పుకోదగ్గ బహుమతి ఒక్కటి కూడా కొనలేదు. సిరి కోసం ఓ గిఫ్ట్ కొంటాను. అలాగే సొంతింటి కల నెరవేర్చుకుంటాను , అన్నాడు. Srihan Siri Marriage ఇటీవల సిరి బర్త్ డే శ్రీహాన్ ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఈ సందర్భంగా ఆమెకు ఒక రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే అది వెడ్డింగ్ రింగ్… రొమాంటిక్ గా సిరిని పెళ్లికి ఒప్పించాడన్న ప్రచారం జరుగుతుంది. శ్రీహాన్-సిరి ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు. కాగా గతంలో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందనే వాదన ఉంది. ఎటూ పెళ్లీడు కూడా దాటిపోతుండగా… వివాహ బంధంతో ఒక్కటవ్వాలని ఫిక్స్ అయ్యారట. సిరి-శ్రీహాన్ త్వరలో పెళ్లి ప్రకటన చేసే ఆస్కారం కలదనేది లేటెస్ట్ న్యూస్. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో శేఖర్ మాస్టర్ నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !