ఆరుగాలం కష్టం బుగ్గిపాలు
*వరి కుప్పకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
రూ. లక్ష విలువైన వరి ధాన్యం బుగ్గిపాలు
* పాత కక్షలే కారణమా?
మన్యం న్యూస్ చర్ల జనవరి 8: ఆరుగాలం కష్టపడి ప రైతు పంట పండించి ఒక దగ్గర కుప్పగా వేశాడు. కానీ అగ్ని దేవుడి ఆగ్రహానికి ఆ రైతుకు చివరికి కన్నీరే మిగిలింది. అప్పో… సప్పో చేసి పంట పండించి, తీర చేతికి వచ్చే సమయానికి మానవత్వం లేని కొంతమంది గుర్తు తెలియని చేసిన వ్యక్తుల చర్యకు కాలి మసై బూడిదయింది. ప్రత్యక్ష సాక్షులు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఈలా ఉన్నాయి.చర్ల మండలం రైసుపేట గ్రామం లోని తాటిగుంపు కు చెందిన గంధం ఆదిలక్ష్మి అనే మహిళ రైతుకు చెందిన రెండున్నర ఏకరాల వరి కుప్పకు శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీనితో ఆ వరి కుప్ప పూర్తిగా దగ్దం అవడం జరిగింది. ఎండనక వాన్నక కష్టపడి పండించిన పంట కండ్ల ముందే బూడిదగా మారడంతో బాధితురాలు గంధం ఆదిలక్ష్మి కన్నీరు మున్నీరు గా విలపించింది .ఈ ఘటన చూసి పలువురు కన్నీరు పెట్టారు. వ్యక్తిగత కక్షలు నేపథ్యంలోనే తన వరికుప్పలు దగ్ధం చేసినట్లు బాధితురాలు ఆదిలక్ష్మి మన్యం న్యూస్ కి తెలిపారు. అప్పు చేసి వరి పంట సాగు చేయడం జరిగిందని ,మహిళ రైతు అయినందున తనను ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆదిలక్ష్మి వేడుకుంటుంది. అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని ఆమెడిమాండ్ చేశారు.